చైతూ వెబ్ సిరీస్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Update: 2022-01-28 07:34 GMT
నాగ చైతన్య వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అధికారికంగా షూటింగ్ ప్రారంభం కాలేదు ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ ను ముగించినట్లు వార్తలు వస్తున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్ గా రూపొందబోతున్న ఈ వెబ్‌ సిరీస్ కు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ వెబ్‌ సిరీస్ లో నాగ చైతన్య నెగటివ్‌ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న థ్యాంక్యూ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ వెబ్‌ సిరీస్ ను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే ఏడాదిలో వెబ్‌ సిరీస్ ను అమెజాన్ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఇటీవలే ఈ వెబ్‌ సిరీస్ కోసం ప్రముఖ సీనియర్ నటుడిని సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిందట. ఇక హీరోయిన్‌ కూడా వెబ్‌ సిరీస్ కోసం ఎంపిక చేయడం జరిగిందట.

ఇదే సమయంలో ఈ వెబ్ సిరీస్ లోని నాగ చైతన్య లుక్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక విభిన్నమైన లుక్ లో నాగ చైతన్య కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్‌ చెబుతున్నారు. నాగ చైతన్య ను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారట.

ప్రైమ్‌ వీడియో లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ తో నాగ చైతన్య తన యొక్క కొత్త రూపాయన్ని చూపించడం మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఈ వెబ్‌ సిరీస్ తో తనను తాను నిరూపించుకోబోతున్నాడు. నాగ చైతన్య కెరీర్‌ ఆరంభం నుండి విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు కాని లుక్ పరంగా మాత్రం ఒకే తరహా లో కనిపించాడు.

 కాని మొదటి సారి నాగ చైతన్య చాలా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు. వెబ్‌ సిరీస్ చేయాలనే ఉద్దేశ్యంతో నాగచైతన్య చాలా కాలంగానే ఆసక్తిగా ఉన్నాడు. తాజాగా నాగ చైతన్య తాను కోరుకున్న నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్యను కొత్తగా చూడబోతున్నాం. లవ్ స్టోరీ మరియు బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్న నాగ చైతన్య త్వరలోనే థ్యాంక్యూ మరియు లాల్‌ సింగ్‌ చద్దా సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Tags:    

Similar News