బాలయ్య vs మెగా: ఈసారి గెలుపు ఎవరిది?

ఇప్పుడు, 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ - డాకు మహారాజ్ మధ్య పోటీ చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-01-11 14:29 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ప్రతి సంక్రాంతి ఒక పెద్ద పండుగలా మారింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్‌లు సాధారణంగా మారాయి. చిరంజీవి రీఎంట్రీ తరువాత బాలకృష్ణ సినిమాల‌తో వచ్చిన పోటీలు మరింత హాట్ టాపిక్‌గా నిలిచాయి. ప్రతిసారి టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్ల పరంగా మెగా సినిమాలు ముందంజలో ఉండటం గమనార్హం. ఈమధ్య కాలంలో ఈ వార్ లో బాలయ్య పూర్తి స్థాయిలో డామినేషన్ చూపించడం లేదు. ఇక ఈసారి గేమ్ ఛేంజర్ vs డాకు మహారాజ్ క్లాష్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక గతంలో క్లాష్ ను ఒకసారి గమనిస్తే..

2017: ఖైదీ నెంబర్ 150 vs గౌతమి పుత్ర శాతకర్ణి

చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ 50వ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి ఒకే రోజు విడుదలయ్యాయి. ఖైదీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, శాతకర్ణి క్లాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా మెగా ఫ్యాన్స్ తమ సినిమా పైచేయిగా ఉందని నిరూపించారు.

2018: అజ్ఞాతవాసి vs జై సింహా

2018 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి - బాలయ్య నటించిన జైసింహా విడుదలయ్యాయి. అజ్ఞాతవాసి భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, టాక్ నెగిటివ్‌గా మారడంతో కలెక్షన్లు ఊహించిన స్థాయికి చేరలేదు. అయినప్పటికీ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ, జై సింహాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా హై రేంజ్ లో అయితే డామినేషన్ చూపలేదు. ఈ క్లాష్‌లో ఏ సినిమా కూడా హై రేంజ్ లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు.

2019: వినయ విధేయ రామ vs ఎన్టీఆర్ కథానాయకుడు

రామ్ చరణ్ వినయ విధేయ రామతో, బాలయ్య తన ఎన్టీఆర్ కథానాయకుడుతో సంక్రాంతి బరిలో దిగారు. అయితే, అప్పుడు టాక్ ఇరువైపులా మిశ్రమంగా ఉండటంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత రాణించలేకపోయాయి. వినయ విధేయ రామ కమర్షియల్ మ్యాజిక్‌తో కొంతవరకు నిలబడినా, ఎన్టీఆర్ కథానాయకుడు సీరియస్ నేటివ్ కంటెంట్ కారణంగా పరిమితమైన వసూళ్లను మాత్రమే రాబట్టింది.

2023: వాల్తేరు వీరయ్య vs వీర సింహా రెడ్డి

2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డితో బరిలో దిగారు. ఇక వాల్తేరు వీరయ్య మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీర సింహా రెడ్డి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మెగాస్టార్ పై అప్పర్ హ్యాండ్ అయితే క్రియేట్ చేయలేదు.

2025: గేమ్ ఛేంజర్ vs డాకు మహారాజ్

ఇప్పుడు, 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ - డాకు మహారాజ్ మధ్య పోటీ చర్చనీయాంశంగా మారింది. గేమ్ ఛేంజర్ ప్యాన్ ఇండియా బజ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా, డాకు మహారాజ్ బాలయ్య మాస్ క్రేజ్‌ను నమ్ముకుంది. అయితే, ఈసారి బాలయ్య డాకు మహారాజ్ తో డామినేట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సారి బాక్సాఫీస్ యుద్ధం మరింత ఆసక్తిగా మారింది. గేమ్ ఛేంజర్ కు టాక్ అంతగా పాజిటివ్ గా అయితే రాలేదు. మరి ఈసారి బాలయ్య తన సినిమాతో మెగా డామినేషన్‌ను అధిగమిస్తారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News