ప్యారడైజ్ లో విలన్ గా టాలీవుడ్ సీనియర్ హీరో?
దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ది ప్యారడైజ్ గ్లింప్స్ కూడా అదిరిపోవడంతో అప్పటివరకు ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి.;
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపియెస్ట్ హీరో ఎవరంటే వెంటనే అందరూ నాని పేరు చెప్పేస్తారు. గత కొంత కాలంగా నాని ఏం చేసినా సక్సెస్ అవుతుంది. హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న నాని, తాజాగా తను నిర్మించిన కోర్టు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్న నాని ఓ వైపు తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు చేతిలో ఉన్న రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాని ప్రస్తుతం హిట్3 తో పాటూ ది ప్యారడైజ్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి.
దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ది ప్యారడైజ్ గ్లింప్స్ కూడా అదిరిపోవడంతో అప్పటివరకు ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
వార్తలైతే వస్తున్నాయి కానీ ఇప్పటివరకు మోహన్ బాబు పాత్ర విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. సోనాలీ కులకర్ణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో ఎనిమిది భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక మోహన్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం ఆయన మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తోన్న కన్నప్ప సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. కన్నప్పలో మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించారు. గత కొంతకాలంగా మోహన్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడంతో ఆయన హీరోగా సినిమాలు చేయడం మానేశారు. గతంలో పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించిన మోహన్ బాబు ఇప్పుడు నాని సినిమాలో నటించనున్నాడనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.