బాహుబలి లాంటి చరిత్ర తిరగరాసిన చిత్రంలో చిన్న రోల్ చేసిన వారికైనా.. ఎనలేని ఖ్యాతి దక్కింది. మరి అలాంటి మూవీలో విలన్ కేరక్టర్ అంటే మాటలా ? అందులోనూ బాహుబలి ప్రభాస్ - భల్లాలదేవ రాణా ఒకేవైపు ఉంటే.. వారిద్దరికీ పోటీ ఇవ్వడంలో.. కాలకేయుడిగా చేసిన ప్రభాకర్ తన వికృత రూపంలో మెప్పించగలిగాడు. మరి బాహుబలిలో కాలకేయుడు చనిపోయాడు కదా. మరి సీక్వెల్ సంగతేంటి ?
బాహుబలిలో కాలకేయుడు చనిపోయాడు కాబట్టి.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే చూపించగలరు. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ ని ప్రభాకర్ తో చేయించడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు రాజమౌళి కొత్త విలన్ ని వెతికేశాడు. బాహుబలి పార్ట్ టూ కోసం కాలకేయుడి తమ్ముడిని తీసుకొస్తున్నారట. ఇలాంటి పాత్రకు సూట్ అయ్యే యాక్టర్ కోసం.. కొన్ని రోజులుగా జక్కన్న సెర్చింగ్ లో ఉన్నాడని టాక్. ఇప్పుడా వెదుకులాటకు ఫుల్ స్టాప్ పెట్టేశాడని అంటున్నారు.
లోఫర్ మూవీలో విలన్ కి పెద్ద కొడుకుగా నటించిన చరణ్ దీప్ సుర్నేని.. కాలకేయుడి సోదరుడి పాత్రను పోషించనున్నాడట. బాహుబలి లాంటి భారీ మూవీలో విలన్ రోల్ రావడమంటే.. చరణ్ దీప్ కెరీర్ కి టర్నింగ్ వచ్చేసినట్లే అంటున్నారు. కాకపోతే ఒకటే ప్రాబ్లెం.. ఇప్పుడీ చరణ్ అర్జంటుగా కిలికి భాష ప్రాక్టీస్ చేసుకోవాలి.