భామలిద్దరి ఆఖరి ఆప్షన్‌ వర్మ సారే

Update: 2015-09-18 04:29 GMT
మామూలుగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ బయట ప్రపంచంలో కంటే ట్విట్టర్‌ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. అయితే మనోడు సినిమాలు షూటింగ్‌ చేయడం లేకపోతే ట్వీట్ల తుపాకీ పేల్చడం అన్న చందంగా యవ్వారం సాగుతుంటుంది. నిన్నటి రోజున వినాయక చవితి సందర్భంగా సేమ్‌ టు సేమ్‌ ఇలాగే ఏవేవో సైటైర్ లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో కొత్త అబ్జర్వేషన్‌ ఉందండోయ్‌. పదండి చూద్దాం.

ఈ మధ్య కాలంలో రాము ఏ ట్వీట్‌ వేసినా కూడా.. దానికి మొదటగా రిప్లయ్‌ ఇచ్చేది ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరూ కూడా హీరోయిన్ లు. ఒకటి మన హాట్‌ జ్యోతిలక్ష్మి ఛార్మి అయితే, రెండవ లేడీ ఫేడింగ్‌ బ్యూటి పూనమ్‌ కౌర్‌. గత కొంతకాలంగా పూరితో క్లోజ్‌ ఫ్రెండ్‌ షిప్‌ కారణంగా రామూతో కూడా కాస్త క్లోజ్‌ గానే దూసుకుపోతోంది పంజాబీ ఫైర్‌ బ్రాండ్‌ ఛార్మి. అయితే అమ్మడు ట్విట్టర్ లో ఆర్‌.జీ.వి.పై మాత్రం కాస్త సెటైర్ లే వేస్తోందిలే. ఇక పూనమ్‌ కౌర్‌ మాత్రం ఎవరు ఏమనుకున్నా రాము చాలా ఇన్నోసెంట్‌ అండ్‌ గుడ్‌ గయ్‌ అంటూ స్టేట్‌ మెంట్ లు ఇస్తుంటే, ఎందుకుతల్లీ నా పరువు తీస్తావ్‌ అంటూ స్వయంగా మనోడు రిప్లయ్‌ ఇవ్వడం సూపర్‌. అసలు ఈ ఇద్దరూ సడన్‌ గా ఆయనపై ఇంత ప్రేమ ఎందుకు వలకపోస్తున్నారు?

ఏమీ లేదండీ.. ప్రస్తుతం రామ్‌ గోపాల్‌ వర్మ డైరక్షన్‌ లో ఓ సినిమా చేస్తోంది పూనమ్‌ కౌర్‌. ఆల్రెడీ మనోడు ఆమెను వీరప్పన్స్‌ కిల్లర్‌ సినిమాలో తీసుకున్నాడట. ఇప్పుడు తదుపరి మరో రెండు సినిమాల్లో కొన్ని ఇంపర్టెంట్‌ గ్లామరస్‌ రోల్‌ లో నటింపజేస్తున్నాడట. అందుకే పూనమ్‌ ఇంత హడావుడి చేస్తోంది. ఇక ఛార్మి అంటారా.. సినిమాలేం లేవు.. రాము ఏదైనా ఇస్తే మాత్రం సూపరే. కెరియర్‌ ఎండ్‌ పాయింట్‌ వచ్చేసిన వీళ్లిద్దరికీ మెగా ఆప్షన్‌ రాము ఒక్కడే.

Tags:    

Similar News