న‌టితో డీల్ సెట్టింగ్ ఇలా జ‌రుగుతుంది

Update: 2018-06-16 06:09 GMT
సినీ తార‌ల‌తో డీల్ సెట్టింగ్‌ కు సంబంధించిన విస్మ‌య‌క‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు అమెరికాకు తీసుకొచ్చే న‌టీమ‌ణుల‌తో చీక‌టి దందాలు నిర్వ‌హించే కుంభ‌కోణాన్ని అమెరిక‌న్ పోలీసులు ర‌ట్టు చేయ‌టం.. దీనికి సంబంధించిన వివ‌రాల్ని బ‌య‌ట‌పెట్ట‌టం తెలిసిందే. తెలుగు సినీ రంగంతో సంబంధాలు ఉన్న కిష‌న్..చంద్ర‌క‌ళ దంప‌తులు ఏడాది వ్య‌వ‌ధిలో వ‌ర్థ‌మాన తెలుగు.. క‌న్న‌డ తార‌ల్ని అమెరికాకు ర‌ప్పించేందుకు 76 ఫ్లైట్ టికెట్స్ ను బుక్ చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విజిట‌ర్ వీసాల మీద అమెరికాకు ర‌ప్పించి.. గంట‌ల చొప్పున న‌టీమ‌ణుల‌ను బుక్ చేసి విటుల‌ను బుక్ చేసే వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే.. రేట్ల‌ను ఫిక్స్ చేయ‌టం ద‌గ్గ‌ర నుంచి విటుల‌కు అవ‌స‌ర‌మైన తార‌ల్ని స‌ర‌ఫ‌రా చేసే విష‌యంలో కిష‌న్ స‌తీమ‌ణి చంద్ర‌క‌ళ కీ రోల్ ప్లే చేసిన వైనం ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. న‌టీమ‌ణుల‌కు గంప గుత్త‌గా మాట్లాడేసుకోవ‌టం.. టూర్ మొత్తానికి ఇంత మొత్తం పిక్స్ చేసి.. విటుల‌ను పంపిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే.. ఈ గ‌లీజు ఒప్పందంలో న‌టీమ‌ణుల‌కు ద‌క్కేది త‌క్కువేన‌ని.. కిష‌న్ దంప‌తులే భారీగా సొమ్ము చేసుకుంటార‌ని చెబుతున్నారు.

న‌టీమ‌ణుల‌ను బుక్ చేసుకోవ‌టానికి విటుల‌తో చంద్ర‌క‌ళ జ‌రిపే చాట్స్ కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ..చంద్రకళ ఫోన్‌లో దర్యాప్తు అధికారులకు దొరికిన కొన్ని చాట్ వివ‌రాలివి. ఇలాంటివి చాలానే ఉన్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప్ర‌చురించిన ఈ చాట్ ను య‌థాత‌ధంగా చూస్తే..

2017 - నవంబరు 7  (కిషన్‌ భార్య చంద్రకళకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది)

అజ్ఞాత వ్యక్తి: ఫలానా నటి దొరుకుతుందా? నా స్నేహితుడొకడు మీ నంబర్‌ ఇచ్చాడు. ఆ నటి నాకు 3 - 4 గంటలపాటు కావాలి. 1000 డాలర్లు (దాదాపు రూ.68 వేలు) ఇస్తాను. మీకు ఓకే అనుకుంటే గనక నాకు చెప్పండి
(అతడి మెసేజ్‌ లకు స్పందించిన చంద్రకళ.. అతడు అడిగిన నటివి కాకుండా వేరే నటివి మూడు ఫొటోలు పంపింది)

అజ్ఞాత వ్యక్తి: కాదు - ఈమె కాదు బేబీ..

చంద్ర: ఈమె అయితే 1200 డాలర్లకు (దాదాపు రూ.82 వేలు) వస్తుంది. అది కూడా ఒకసారికి మాత్రమే.

అజ్ఞాత వ్యక్తి: నేనడిగిన అమ్మాయే కావాలి.
(అతడు అడిగిన నటి ఫొటోలను చంద్ర తన ఫోన్‌ ద్వారా పంపింది)

అజ్ఞాత వ్యక్తి: అవును.. ఈమే - బేబీ..
 
డిసెంబరు 1 - 2017

చంద్రకళ: ఫలానా నటి ఇప్పుడు ఇక్కడే ఉంది..

అజ్ఞాతవ్యక్తి: మీ దగ్గర కొత్త అమ్మాయి ఉన్నట్టు నా ఫ్రెండ్‌ చెప్పింది. నేను తెలుగువాణ్ని కాను.

చంద్రకళ: నేను ఫొటోలు పంపనా?

అజ్ఞాతవ్యక్తి: పంపండి

చంద్రకళ: (ఫొటోలు పంపింది)

అజ్ఞాతవ్యక్తి: ఓకే

చంద్రకళ:ఈమె ఇవాళ - రేపు మాత్రమే ఉంటుంది.

అజ్ఞాత వ్యక్తి: నేను అంత ధనవంతుణ్ని కాను. రేటు కాస్త చూసి చెప్పండి.

చంద్రకళ: మీ బడ్జెట్‌ ఎంతో చెప్పండి

అజ్ఞాత వ్యక్తి: కిందటిసారి ఇచ్చినంతే. ఆ పొడుగాటి అమ్మాయికి ఇచ్చాను కదా. మీరు ఆమెను కంఫర్ట్‌ ఇన్‌ హోటల్‌ దగ్గర దింపారు.

చంద్రకళ: ఈమె అయితే 3 గంటలకు రెండుసార్లు - 2500 డాలర్లు (దాదాపు రూ.1.70 లక్షలు).

అజ్ఞాత వ్యక్తి: థ్యాంక్స్‌ - నేనంత ఖర్చు పెట్టలేను

చంద్రకళ: ఆఖరు మాట.. 2 సార్లకు - 2000 డాలర్లు (దాదాపు రూ.1.36 లక్షలు).



Tags:    

Similar News