సినిమాల్లో నటిస్తున్నప్పుడు చిరు బర్త్ డే వచ్చిందంటే ఆ హంగామానే వేరుగా ఉండేది. ఫిల్మ్ నగర్ అంతా కళకళలాడిపోయేది. అభిమానులు రెండు మూడు రోజులు ముందుగానే హైదరాబాద్ చేరుకొనేవారు. ఎక్కడో ఒక చోట కలిసి విషెస్ చెప్పి వెళ్లిపోయేవాళ్లు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక ఆ సందడి తగ్గిపోయింది. చిరు రాజకీయాల హడావుడి మధ్యే పుట్టినరోజు సంబరాలు చేసుకొనే పరిస్థితి వచ్చింది. అయితే యేడాదిన్నర క్రితమే మళ్లీ నటించాలని నిర్ణయించుకొన్నాడు చిరు. దీంతో మళ్లీ మెగా అభిమానుల సందడి మొదలైంది. అన్నయ్య వస్తున్నాడోచ్.. అంటూ సంబరాలు చేసుకొంటున్నారు. చిరు 150వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు.
నిజానికి కథ కుదిరితే గతేడాది బర్త్ డే రోజునే సినిమాని ప్రకటించాలనుకొన్నాడు చిరు. కానీ కథలే సెట్టవ్వలేదు. వందల కథలు విన్నప్పటికీ చిరుకి ఏదీ నచ్చలేదు. పూరి జగన్నాథ్ చెప్పిన ఓ కథ మాత్రం ఆయన్ని ఇంప్రెస్ చేసింది. దీంతో `పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయ్..` అని పూరికి చెప్పాడు చిరు. ప్రస్తుతం పూరి ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ కథ ఓకే అయ్యింది కానీ... సెకండ్ హాఫ్ కథ దగ్గరే చిక్కొచ్చినట్టు సమాచారం. పూరి అండ్ టీమ్ సెకండ్ హాఫ్ కథ గురించే కసరత్తులు చేస్తోందని అయినా చిరు అనుకొన్నట్టుగా రావడం లేదని సమాచారం.
ఆ కథకి సంబంధించిన సంగతులేమో పూర్తిగా ఎవ్వరికీ తెలియదు కానీ... అభిమానులు మాత్రం అన్నయ్య కనీసం ఈ పుట్టినరోజుకైనా సినిమాని ప్రకటించాల్సిందే అని కోరుకొంటున్నారు. ఆ లెక్కన చిరుకి ఇంకో రెండు వారాల మాత్రమే సమయం ఉంది. ఆ లోపున కథ ఓకే చేసి తన రీ ఎంట్రీ సినిమాని ప్రకటిస్తాడా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. మెగా కుటుంబం మాత్రం ఈ పుట్టినరోజునాడు సినిమాని ప్రకటించాలనే డిసైడ్ అయ్యింది. మరి ఆ లోపు చిరు ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో చూడాలి.