అబ్బా నాని.. చించేశావ్ పో..!

మరోసారి తన మాస్ యాటిట్యూడ్ ని చూపించడానికి సిద్ధం అవుతున్న నాని దానికి హింట్ ఇస్తూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటో పెట్టాడు.

Update: 2025-02-01 14:35 GMT

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి చేసి నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల సినిమాకు రెడీ అవుతున్నాడు. దసరా తో శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నానిని అప్పటివరకు ఒకలా అందరు చూపిస్తే శ్రీకాంత్ మాత్రం అతనిలోని మరో యాంగిల్ చూపించాడు. దసరా ధరణి పాత్ర నాని కెరీర్ లో మైల్ స్టోన్ రోల్ అని చెప్పొచ్చు. అందుకే ఆ డైరెక్టర్ తోనే మరో సినిమా చేస్తున్నాడు.

 

ఇక ఆ సినిమాకు కావాల్సిన దేహదారుఢ్యాన్ని రెడీ చేసుకునే పనుల్లో ఉన్నాడు నాని. మరోసారి తన మాస్ యాటిట్యూడ్ ని చూపించడానికి సిద్ధం అవుతున్న నాని దానికి హింట్ ఇస్తూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటో పెట్టాడు. జిమ్ లో కష్టపడుతూ అలా రిలాక్స్ అయినట్టుగా ఉన్నాడు నాని. కండలు చూస్తుంటే ఈసారి దసరా కాదు అంతకు మించి అనిపించే సినిమా చేసేలా ఉన్నారని అనిపిస్తుంది.

ఇటు హిట్ 3 లో కూడా పవర్ ఫుల్ కాప్ గా కనిపించనున్నాడు నాని. హిట్ 3 ఇంకా శ్రీకాంత్ ఓదెల సినిమా రెండిటికీ ఫిట్ నెస్ అవసరమే. నాని వర్క్ అవుట్ చూస్తుంటే కచ్చితంగా అది శ్రీకాంత్ ఓదెల సినిమా కోసమే అన్నట్టు ఉంది. అంతేకాదు లాంగ్ హెయిర్ గడ్డం నాని మళ్లీ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టుగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల నాని రెండో సినిమా పారడైస్ అనే టైటిల్ తో రాబోతుంది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మరి దసరా కాంబో అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమాల లెక్క ఎలా ఉన్నా నాని షేర్ చేసిన లేటెస్ట్ జిమ్ ఫోటో చూసిన ఆడియన్స్ అబ్బా నాని చించేశావ్ పో అనేస్తున్నారు. న్యాచురల్ స్టార్ ఇప్పుడు మాస్ కమర్షియల్ స్టార్ గా మారిపోతున్నాడు. అయినా సరే కమర్షియల్ సినిమాల్లో కూడా కంటెంట్ విషయంలో లెక్క తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు నాని. ఈ సమ్మర్ కి హిట్ 3 తో రాబోతున్న నాని శ్రీకాంత్ ఓదెల సినిమాను ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News