ఖైదీ నంబర్ 150.. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ సెన్సేషన్స్ కు బ్రేక్ పడ్డం లేదు. టీజర్ నుంచి మొదలుపెట్టి ఆడియో సాంగ్స్ వరకూ తెలుగు ఇండస్ట్రీలో యూట్యూబ్ రికార్డులను తిరగరాసేస్తున్నారు మెగాస్టార్. చిరు మూవీపై హైప్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ పై చిరు ఎలా కనిపించనున్నారనే ఆసక్తి.. రికార్డులకు కారణమవుతోంది. మరోవైపు కొన్ని రకాల వివాదాలు కూడా.. ఈ రికార్డులకు కారణం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఖైదీ నంబర్ 150కి సంబంధించి.. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు దాదాపుగా పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. అన్ని ఏరియాల్లోనూ రికార్డు రేట్లకు విక్రయించారు. ఈ మొత్తాన్ని రికవర్ చేయడానికి ఇండస్ట్రీ హిట్ కాక తప్పని పరిస్థితి ఖైదీకి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఖైదీ శాటిలైట్ హక్కులు కూడా రికార్డు రేటుకు విక్రయం అయ్యాయి. ఓ లీడింగ్ ఛానల్ ఏకంగా 13 కోట్ల రూపాయలు చెల్లించి ఖైదీ నంబర్ 150 హక్కులను దక్కించుకుందట.
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్న హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలకు మాత్రమే ఇంతటి శాటిలైట్ రేట్ అందుకోవడం సాధ్యం అవుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నా.. టాప్ లెవెల్ లో ఖైదీకి శాటిలైట్ రావడం అంటే.. అందుకు కారణం మెగా మేనియా మాత్రమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/