సర్దార్ ఆడియో: తమ్ముడి స్టెప్ కోసం వెయిటింగ్

Update: 2016-03-20 18:01 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాభిమానులను ఉర్రూతలూగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఇప్పటివరకూ మెగాస్టార్ ని ఇమిటేట్ చేయడం లాంటి వాటికి దూరంగా ఉన్న పవన్.. తొలిసారిగా ఆయన వేసిన సూపర్బ్ స్టెప్ ను రీ లైవ్ చేశాడు.

ఇంద్ర మూవీలో దాయిదాయి దామ్మా పాటకు చిరంజీవి వేసిన వీణ స్టెప్.. ఇప్పటికీ మెమరబుల్. దీన్నే పవన్ సర్దార్ లో చూపించబోతున్నాడు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అయితే.. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ట్రై చేశానని ఆడియో ఫంక్షన్ ముందు రోజున పవన్ అనడంతో.. ఈ స్టెప్ విషయం తేలిపోయింది. వీణ స్టెప్ వేసేందుకు పొద్దున 9నుంచి రాత్రి రెండున్నర వరకూ పవన్ విసిగించాడని ఆలీ చెప్పాడు. అయితే తన స్టెప్ ను తమ్ముడు వేశాడని తెలియడంతో.. చిరు తెగ హ్యాపీగా ఫీలయిపోయారు.

'పవన్ దాయిదాయి దామ్మా స్టెప్ వేశాడని విన్నాను. దాన్ని చూడాలని మీరు ఎంత ఆత్రంగా ఉన్నారో.. నేను మీకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అంటూ చిరంజీవి చెప్పారు. అంతే కదా.. చిరును ఇమిటేట్ చేసేవాళ్లు చాలామంది ఉన్నా.. తన పేరును, వారసత్వాన్ని నిలబెడుతున్న పవన్ కళ్యాణ్ తనను ఉపయోగించుకుంటే.. ఆ అన్నయ్య ఆనందం ఆ రేంజ్ లోనే ఉంటుంది మరి.
Tags:    

Similar News