''బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో.. దానికంటే సర్దార్ పెద్ద హిట్టు అవ్వాలి.. అలాగే బాహుబలి రికార్డులను సర్దార్ బద్దలు కొట్టేస్తే.. ఆ తరువాత వేరే హీరోల సినిమా రికార్డులు ఈ రికార్డులను బద్దలు కొట్టాలి. రికార్డులు ఎవ్వరి సొంతం కాదు. ఏ ఒక్కరికో చెందవ్. అందరూ రికార్డులు కొట్టాలి. వాటిని మరొకరకు బ్రేక్ చేయాలి. అప్పుడే సినిమా ఇండస్ర్టీ ఆరోగ్యకరంగా ఉంటుంది'' అన్నారు మెగాస్టార్ చిరంజీవి. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లో మాట్టాడిన ఆయన.. ఆద్యంతం మెగా అభిమానులను అలరించారు.
అలాగే ఈ సినిమాకు పనిచేసిన దేవిశ్రీప్రసాద్ కు తాను చిన్నప్పుడు వాచ్ ఇచ్చి నీ టైమ్ మారిపోతుంది పో అని చెబితే.. ఇప్పుడు నిర్మాతలకు మాత్రమే కాదు.. చివరకు తనకు కూడా టైమ్ ఇవ్వట్లేదని జోక్ చేశారు చిరంజీవి. పక్కనే ఉన్న దేవిశ్రీ ప్రసాద్.. 'అయ్యో సార్' అంటే.. ''సరే నా తదుపరి సినిమాకు నువ్వే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నావ్'' అంటూ చిరంజీవి చెప్పడంతో.. దేవిశ్రీ ''ఎస్'' అన్నాడు.