ఫోటో స్టోరి: మహేష్‌ సెట్లో మెగా అతిథి

Update: 2017-03-06 13:34 GMT
ఇప్పుడు సీజన్ మారింది. ట్రెండ్ మారింది. తెలుగు నటీనటులు అందరూ ఎక్కువగా సోషలైజ్ అవుతున్నారు. అసలు ఇతర హీరోల సెట్స్ లో మనోళ్ళు సందడి చేస్తుంటే.. వావ్ అనిపించక మానదు.

అదిగో మొన్న ఖైదీ నెం 150 షూటింగ్ స్పాటుకు చాలామంది యంగ్ హీరోలు వచ్చినట్లు.. ఇప్పుడు ఆ ఖైదీ ఇతర షూటింగులను వీక్షిస్తున్నారు. బహుశా సర్దార్ సినిమా షూటింగ్ లొకేషన్ కు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడ మహేష్‌ బాబు కు కూడా అలాగే స్వీట్ షాకిచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్‌ బాబు సినిమా షూటింగ్ జరుగుతోంది. మురుగుదాస్ అక్కడే ఒక సాంగ్ షూట్ చేస్తున్నాడు. అయితే పక్కనే మీలో ఎవరు కోటీశ్వరుడు టివి షో షూటింగ్ లో ఉన్న చిరంజీవి.. పక్కనే జరుగుతున్న మహేష్‌ షూట్ కు విచ్చేయడంతో.. యునిట్ అంతా ఆనందపడ్డారనుకోండి.

ఈ విధంగా మహేష్‌ సినిమా సెట్టుకు మెగా అతిథి వచ్చారని.. ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ సంతోష్‌ శివన్ అభిమానులతో పంచుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News