మెగాస్టార్ చిరంజీవి, సురేఖలు ఈరోజు తమ 44వ పెళ్లి రోజును జరుపుకుంటున్నారు. 1980వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మద్రాసులో స్నేహితుల, బంధువుల మధ్యన ఉదయం 10.50 నిమిషాలకు చిరంజీవి, సురేఖలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సురేఖ చిరు జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇదే విషయాన్ని చాలా వేదికల్లో మెగాస్టార్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఆయన పెళ్లి నాటి పత్రిక నెట్టింట వైరల్ గా మారింది. ఫిబ్రవరి 20వ తేదీ రోజు ఉదయం పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయగా.. అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు రిసిప్షన్ కూడా నిర్వహించారు.
అయితే సురేఖ హాస్య టుడు అల్లు రామలింగయ్య కుమార్తె అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అందులో సుస్మిత పెద్దది కాగా, రాం చరణ్ రెండోవాడు. మూడోసారి కూతురు శ్రీజ పుట్టింది.
ఇప్పటికీ చిరంజీవి, సురేఖలు చాలా అన్యోన్యంగా ఉంటారు. 44 ఏళ్ల వారి వివాహం బంధం చాలా సంతోషంగా సాగుతుందని.. తనకు ఎన్ని పనులు, బాధ్యతలు ఉన్నా... పిల్లల బాధ్యత అంతా సురేఖనే చూసుకుందని చిరంజీవి గర్వంగా చెబుతుంటారు.
ఆమె వల్లే తాను చాలా సంతోషంగా ఉండగల్గుతున్నాని అంటారు. అంతేకాకుండా తన పెళ్లికి తాను గెస్టులా వచ్చి కేవలం తాళి కట్టానని చాలా సార్లు వివరించారు. ఆయన తన పెళ్లి సమయంలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే ఇందుకు కారణం అని చెప్పారు.
పెళ్లి సమయంలో నూతన ప్రసాద్ తో కలిసి చిరంజీవి తాతయ్య ప్రేమ లీలలు.. సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ బట్టల్లోనే వచ్చి నేరుగా పెళ్లి పీటలపై కూర్చొని.. సురేఖ మెడలో తాళి కట్టారట మెగాస్టార్. రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.124.27 కోట్ల షేర్ తో పాటు రూ.212.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రభంజనం సృష్టించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.