డే అండ్ నైట్ మెగాస్టార్ 152 బ్యాటింగ్

Update: 2020-01-25 07:36 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థా నాయ‌కుడిగా న‌టిస్తున్న 152వ చిత్రం ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం తొలి షెడ్యూల్ షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లోని కొకా పేట‌లో నిర్మించిన ప్ర‌త్యేక సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి  చేస్తున్నార‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లో 80 -99 రోజుల్లో చిత్రీక‌ర‌ణ మొత్తం ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా పూర్తి చేయాల‌నేది టార్గెట్. అందుకు మెగాస్టార్ ముందే కొర‌టాల నుంచి ప్రామిస్ తీసుకున్నారు. అందుకే కొర‌టాల ముందు బిగ్ గోల్ ఉంద‌న్న ముచ్చ‌టా అభిమానుల్లో సాగుతోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో 99 రోజుల్లో షూటింగ్ కి ప్యాక‌ప్ చెప్పి.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అందుకు త‌గ్గ‌ట్టే ద‌ర్శ‌కుడు కొర‌టాల జెట్ స్పీడ్ తో చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నార‌ట‌. త‌న గ‌త సినిమాల‌ తో  పోలిస్తే ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ స్పీడ్ వ‌ల్ల‌ చిరు-కొర‌టాల స‌హా ఇత‌ర‌ యూనిట్ స‌భ్యులు విశ్రాంతి అన్న‌దే లేకుండా రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించాల్సి వస్తోందిట‌. రాత్రి వేళ‌ల్లోనూ నిరంత‌రం షూటింగ్ జ‌రుగుతూనే ఉందిట‌. ప్ర‌స్తుతం నైట్ షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. దీంతో చిరు ఎక్కువ‌గా నైటౌట్లు చేస్తున్నార‌ట‌. కీల‌క స‌న్నివేశాల‌న్ని రాత్రి పూటే తెర‌కెక్కిస్తుండ‌డంతో ఆ మేర‌కు కంటి పై కునుకు క‌రువైంద‌ని చెబుతున్నారు. ఆ అల‌స‌ట క‌ళ్ల‌లో క‌నిపిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది.

కొద్దో గొప్పో ప‌గ‌టి వేళ‌ల్లోనే చిరంజీవికి స‌మ‌యం ల‌భిస్తుండ‌డంతో ఉన్న స‌మ‌యాన్ని నిద్ర‌కే కేటాయిస్తున్నారుట‌. నిద్ర‌లేమితో చిరు ముఖంలో మార్పులు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. 99 రోజుల్లో చిత్రీక‌ర‌ణ పూర్తిచేయాల‌ని చిరునే స్వ‌యంగా పెట్టిన కండీష‌న్ కాబ‌ట్టి ఇది త‌ప్ప‌దు. సాధార‌ణంగా ఒక సినిమా చిత్రీక‌ర‌ణ‌కు కొర‌టాల 130 -140 రోజులు తీసుకుంటారు. కానీ ఆమ‌ధ్య స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆ చిత్రాన్ని మ‌హేష్ 90 రోజుల్లోనే పూర్తిచేసార‌ని తెలిపాడు. ఆ ఉత్సాహంతో చిరు కూడా అదే దారి లో వెళ్తాన‌ని ప‌బ్లిగ్గా ప్రామిస్ చేసి ఇరుక్కున్నార‌న్న మాట‌. 
Tags:    

Similar News