చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న ఘనంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రుతిహాసన్ కథానాయిక. మెగాభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందా లేదా? అన్న క్యూరియాసిటీ నెలకొంది.
ఈ చిత్రం నుండి టైటిల్ ట్రాక్ తాజాగా విడుదలైంది. ఈ పాట అభిమానుల హృదయాలను టచ్ చేసిందని ప్రశంసలు కురుస్తున్నాయి. మెగా అభిమానులు తాజా ఔట్ పుట్ తో చాలా ఉల్లాసంగా ఉన్నారు. అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాకుండా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తమ ఆరాధ్యదైవం మెగాస్టార్ మునుపటి లుక్ లోకి మారడాన్ని కీర్తిస్తున్నారు.
చిరును మళ్లీ మరోసారి రౌడీ అల్లుడు- ముఠామేస్త్రి కాలంలోకి తీసుకెళ్లినందుకు బాస్ లో గ్రేస్ ని బయటకు తీస్తున్నందుకు అభిమానులు దర్శకుడు బాబీకి కృతజ్ఞతలు తెలిపారు. చిరు ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపించడం అభిమానులకు బిగ్ ట్రీట్ గా మారింది. తాజాగా విడుదలైన టైటిల్ పాట చార్ట్ బస్టర్ల జాబితాలో చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ధమాకా స్టార్ రవితేజ కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది.
సంక్రాంతి రేసులో పందెం పుంజులు..
ప్రతియేటా సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి గురించి తెలిసిందే. 2023 సంక్రాంతి సీజన్ లో అగ్ర హీరోల సినిమాలు భారీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య'కు పోటీగా నటసింహా నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'... ఇలయదళపతి విజయ్ 'వారసుడు' (వరిసు-తమిళం) రిలీజ్ బరిలో ఉన్నాయి.
ఈ మూడు సినిమాలు ప్రచార దశలో ఉన్నాయి. విడుదలకు తక్కువ సమయం ఉండడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో చిరంజీవి-బాలయ్య సినిమాలకు ధీటుగా విజయ్ సినిమాని ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలోకి దించే ప్రయత్నాలు సాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ మూడు సినిమాలూ తొలుత అనుకున్న దాని కంటే అదనపు బడ్జెట్ తో తెరకెక్కాయి. అయితే సంక్రాంతి సీజన్ పెట్టుబడును తిరిగి రాబడుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలు నాన్ థియేట్రికల్ డీల్స్ రూపంలో మంచి మొత్తాలను రాబట్టాయి. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని థియేట్రికల్ డీల్స్ (తెలుగు) అతి త్వరలో ఖరారు కానున్నాయి. యథావిధిగా సంక్రాంతి బరిలో మెగాస్టార్ వర్సెస్ నటసింహా వార్ రక్తి కట్టిస్తుందని అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.