డ్రగ్ మాఫియా కాదు డ్రగ్ మీడియా?

Update: 2017-07-21 06:00 GMT
సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో తవ్విన కొద్దీ కొత్త పేర్లు బయటకొస్తున్నాయట. సిట్ అధికారులు ఒక్కొక్కరినీ విచారిస్తున్న కొద్దీ వారి నోటి నుంచి కొత్త పేర్లు బయటకొస్తున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు పూరీ జగన్నాథ్ నుంచి సేకరించిన సమాచారంతో కొన్ని కొత్త పేర్లు వెల్లడికాగా నిన్న శ్యాం.కె.నాయుడిని విచారించినప్పడు వెల్లడైన పేర్లు విని సిట్ అధికారులు కూడా షాకైనట్లు సమాచారం. ముఖ్యంగా ఓ ప్రముఖ మీడియా సంస్థ అధిపతి పేరును శ్యాం నాయుడు చెప్పారని... ఆయనతో పాటు పలువురు యాంకర్లు, విలేకరుల పేర్లు కూడా చెప్పాడంటూ ఓ తెలుగు పత్రికలో కథనం ప్రచురితమైంది.
    
ఈ డ్రగ్స్ దందాలో పారిశ్రామికవేత్తగా ఉన్న ఓ పత్రికాధిపతి పాత్ర కూడా ఉన్నట్టు శ్యాం.కె.నాయుడు చెప్పడంతో సిట్ అధికారులు ఇప్పటికే ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారని సమాచారం. సాక్ష్యాలను సంపాదించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. ఆధారాలు దొరకగానే ఆయనకు నోటీసులు పంపుతారని టాక్.
    
మరోవైపు కెల్విన్ తో పాటు అరెస్ట్ అయిన మరో డ్రగ్స్ వ్యాపారి పీయుష్ స్మార్ట్ ఫోన్ ను విశ్లేషించగా, వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న విలేకరులు, యాంకర్ల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పీయుష్ కు, వీరికి మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించేందుకు 15 మందికి సిట్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారంతా 24వ తేదీ నుంచి తమ ముందుకు రావాలని సిట్ ఆదేశించినట్టు సమాచారం. సో.... సినీ ఇండస్ర్టీతో పాటు మీడియాలోనూ ఇప్పుడీ డ్రగ్స్ వ్యవహారం కలకలం సృస్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News