బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. `బద్రీ` సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత` నాని`..`నరసింహుడు`..`పరమవీరచక్ర` లాంటి సినిమాల్లో నటించింది. అయితే నటిగా ఇక్కడ అంత బిజీ కాలేదు. బాలీవుడ్ లోనే స్థిరపడింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా అమీసా పటేల్ కి కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ కుమారుడు పైసల్ పటేల్ ట్విటర్ వేదికగా ప్రపోజ్ చేసాడు. పైసల్ పుట్టిన రోజు సందర్భంగా అందరూ విషెస్ తెలిపారు. ఈ క్రమంలో అమీసా పటేల్ కూడా ``హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. లవ్ యూ.. ఇది నీకు చాలా అద్భుతమైన సంవత్సరం` `అని రాసుకొచ్చింది.
దీనికి పైసల్ ``ధన్యవాదాలు. నేను అధికారికంగా..బహిరంగంగా ప్రపోజ్ చేస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని డైరెక్ట్ గా`` అడిగేసాడు. అయితే ఆవెంటనే ఆ ట్వీట్ ని తొలగించాడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ ని స్ర్కీన్ షాట్లు తీసి నెటి జనులు బయటపెట్టేసారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ఖండించారు. అయితే పైసల్ బర్త్ డేకి అమీషా మనస్ఫూర్తిగా విషెస్ చెప్పడం.. ఆ వెంటనే పైసల్ పెళ్లి చేసుకోమని అడగడం ఇవ్వన్నీ చూస్తుంటే ఇద్దరు అభిమానులతో దాగుడుమూతలు ఆడుతున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు.
ఇద్దరి మధ్య అంత క్లోజ్ బాండింగ్ లేకపోతే అమీషా అంత ఘాడంగా విషెస్ ఎందుకు? చెబుతుంది. పైసల్ మరో ఆలోచన లేకుండా పెళ్లి ప్రపోజల్ ఎందుకు తెస్తాడంటూ నెటి జనుల్లో చర్చకు వస్తోంది. పైసల్ హెచ్ ఎంపీ పౌండేషన్ కి సీఈవో. గతంలో జైనాబ్ ని వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె 2017 లో గుడె పోటుతో మరణించారు. ఆ తర్వాత 45 ఏళ్లీ అమీషా పటేల్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అమీషాకి ఇంకా వివాహం కాలేదు. ప్రస్తుతం అమీసా పటేల్ `గదర్ 2` లోనటిస్తోంది. ఈ ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.