'భీష్మ‌' టైటిల్ మార్పా! భ‌లే కామెడీలు!!

Update: 2020-02-25 06:30 GMT
యూత్ స్టార్ నితిన్- ర‌ష్మిక జంట‌గా న‌టించిన `భీష్మ` బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస ప్లాప్ ల త‌ర్వాత నితిన్ కి ఊర‌ట‌నిచ్చిన రిజ‌ల్ట్ ఇది. పాజిటివ్ టాక్ నితిన్ లో ఉత్సాహం నింపింది. ``హిట్టు కొట్టి పెళ్లాడెయ్!`` అన్న అభిమానుల ధీవెన‌లు ఫ‌లించాయి ఎట్ట‌కేల‌కు. మొత్తానికి త‌న డ్రీమ్ నెర‌వేరుతోంది. నితిన్ కెరీర్ బెస్ట్ హిట్ కొట్ట‌బోతున్నాడ‌న్న రిపోర్ట్ ఇప్ప‌టికే అందింది.

ఇక భీష్మ‌కు రిలీజ్ ముంగిట వివాదాల గురించి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విష‌యంలో రిలీజ్ కు ముందు కొంత హ‌డావుడి జ‌రిగింది. టైటిల్ మార్చి రిలీజ్ చేయాల‌ని..లేక‌పోతే రిలీజ్ కాకుండా అడ్డుకుంటామ‌ని తెలుగు రాష్ట్రాల్లో బిజేపీ నేత‌లు స‌హా తెలంగాణ గంగ‌పుత్ర సంక్షేమ సంఘం హెచ్చ‌రించింది. ఆజన్మ బ్రహ్మచ‌ర్యం పాటించిన మహాభారత మూల పురుషుడు భీష్ముని పేరును క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు వాడటం కరెక్ట్ కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. హీరోకి భీష్మ పేరు పెట్టి ల‌వ‌ర్ బోయ్ గా చూపిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. మ‌నోభావాలు దెబ్బ‌ తిన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అయినా భీష్మ యూనిట్ దేనినీ ప‌ట్టించుకో లేదు. మా ప‌ని మాదే అన్న తీరుగా వ్య‌వ‌రించారు. ఈ ప్రాసెస్ లో భీష్మ సినిమాకు మ‌రింత ప్ర‌చారం ద‌క్కింది. అయితే రిలీజ్ అనంత‌రం.. బీజేపీ నేతలు కానీ... తెలంగాణ గంగ‌పుత్ర సంఘం కానీ ఎక్క‌డా రిలీజ్ ను అడ్డుకున్న‌దే క‌నిపించ‌లేదు. కేవ‌లం ప్ర‌చార స్టంట్ కే ప‌రిమిత‌మ‌య్యార‌ని తాజాగా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో గంగ‌పుత్ర సంఘం సీన్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. నేడు మ‌ల‌క్‌ పేట పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు న‌మోదు చేసారు. భీష్మ‌ టైటిల్ మార్చే దిశ‌గా పోలీసువారు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎఫ్.ఐ.ఆర్ లో కోరారు. అలాగే దీనికి కార‌ణ‌మైన నితిన్..ర‌ష్మిక‌..వెంకీ కుడుముల‌...చిత్ర నిర్మాత‌ల‌పై ఎఫ్.ఐ.ఆర్ న‌మోదు చేయాల‌ని కోరారు. ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తామ‌ని చెప్పి పంపించేసారు. వ‌రుణ్ తేజ్ న‌టించిన వాల్మీకి టైటిల్ విష‌యంలోనూ వాల్మీకి సంఘాలు చేసిన రుబాబ్ తెలిసిందే. చివ‌రి నిమిషంలో వాల్మీకి బ‌దులుగా గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ అంటూ టైటిల్ మార్చి రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌హా వివాదాలు ఇటీవ‌లి కాలంలో పెచ్చురిల్ల‌డం పై ప‌రిశ్ర‌మ‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. భీష్మ రిలీజై నాలుగు రోజులైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండ్రోజుల్లో సేఫ్ జోన్ కి చేరిపోతున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ టైమ్ లో దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు అన్న‌ట్టు టైటిల్ మార్పు ఎందుకో అంటూ పెద‌వి విరిచేస్తున్నారు కొంద‌రు.
Tags:    

Similar News