సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని.. ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లో అరంగేట్రం చేయనుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ తో సమంత అడుగుపెడుతోంది. మొదటి నుండి సమంత వెబ్ సిరీస్ చేస్తుందని తెలియగానే ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. కానీ రిలీజ్ వరకు హడావిడి చేసిన మేకర్స్.. ఇప్పుడు రిలీజ్ మూడు రోజులే ఉన్నా ఎలాంటి హడావిడి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి ఈ వెబ్ సిరీస్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. పలు మార్లు రిలీజ్ అవుతుందని భావించినా నిరాశే మిగిలింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. మొదటి సీజన్ హిట్ అయినప్పుడే మేకర్స్ సెకండ్ సీజన్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించారు.
ఆ వెంటనే ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ మొదలైంది. ఈ మోస్ట్ అవెయిటింగ్ వెబ్ సిరీస్ మొత్తానికి విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ జూన్ 4 నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడగానే సిరీస్ పై మరింత ఆసక్తి పెరగడం అందులోను బ్యూటిఫుల్ సామ్ ఉందని అంచనాలు రెట్టింపు అయిపోయాయి. కానీ తీరా ముద్ద మింగే టైంలో గొంతుకు అడ్డం పడింది అన్నట్లుగా సిరీస్ స్ట్రీమింగ్ కు మూడు రోజులే ఉన్నప్పటికీ అటు మేకర్స్ ఇటు యాక్టర్స్ సైలెంట్ మెయింటైన్ చేయడం షాకింగ్ గా ఉంది. మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే.. దానికి ఈ వెబ్ సిరీస్ లో తమిళ తంబీలు హర్ట్ అయ్యే అంశాలు సామ్ పాత్రలో కనిపించాయని వారు కేంద్రప్రభుత్వానికి లేఖలు కూడా రాసి సీరిస్ బాన్ చేయాలనీ కోరారు.
మరోవైపు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఇద్దరూ కూడా సిరీస్ చూసాక విమర్శించేవారు ఓ నిర్ణయానికి రావాలని విన్నవించుకున్నారు. అప్పటినుండి తమిళ ప్రజలు కూడా సైలెంట్ అయ్యారు. కానీ ఫ్యామిలీ మ్యాన్ టీమ్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ ప్రారంభించలేదు. అలాగని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం లేదు. పది రోజుల ముందు ప్రమోషన్స్ హోరేత్తించిన మేకర్స్ ఇప్పుడు మూగనోము పాటిస్తే ఎలాగంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. మరి ఇకనైనా మేకర్స్ మౌనం వీడి నోరు మెదుపుతారేమో చూడాలి. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. మేకర్స్ సైలెంట్ అయినా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగానే ఉన్నారని సమాచారం.