ప్ర‌భాస్ 'ఆహా' ఎపిసోడ్ ని కాపీ చేస్తే జైలుకే!

Update: 2022-12-30 03:45 GMT
ఆహా-తెలుగు ప్రాంతీయ ఓటీటీ యూనిక్ కంటెంట్ తో ఇత‌ర దిగ్గ‌జ ఓటీటీల‌కు ధీటుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌తిసారి ఆహా ఏదో ఒక కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా సెల‌బ్రిటీ షోల‌కు హోస్ట్ గా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఎంపిక చేయ‌డం ఒక గొప్ప ఎత్తుగ‌డ కాగా ఇది గొప్ప స‌త్ఫ‌లితాన్ని ఇచ్చింది. అన్ స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కే షో ఓటీటీ రంగంలోనే గొప్ప స‌క్సెస్ రేటుతో అసాధార‌ణ ఆద‌ర‌ణ పొందుతున్న షోగా పాపుల‌రైంది.

అయితే ఇప్పుడు ఓటీటీ రంగానికి పైర‌సీ పెను స‌వాల్ గా మారింది. ఆహాలో ప్ర‌సారం కావాల్సిన కొన్ని సెల‌బ్రిటీ ఎపిసోడ్ లు పైర‌సీలో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అవాక్క‌యిన మేక‌ర్స్ ఇప్పుడు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్  తో ఎన్.బి.కే అన్ స్టాప‌బుల్ షోని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి భాగం 29 డిసెంబ‌ర్ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండవ భాగం జనవరి 6 నుండి ప్రసారం కానుంది. షో మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ లలో ఇది ఒకటి.

బాల‌య్య పంచ్ లు ప్ర‌భాస్ సిగ్గ‌రిత‌నం సొగ‌సైన సంభాష‌ణా చాతుర్యంతో ఈ షో రంజుగా సాగింది. మోస్ట్ అవైటెడ్ ప్రీమియ‌ర్ షో ఇప్ప‌టికే ఆహా- యాప్ క్రాష్ అయ్యే రేంజులో దూసుకుపోయిందంటే అర్థం చేసుకోవాలి. దీనికి క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఆహా బృందం యాప్ ని తిరిగి పున‌రుద్ధ‌రించే ప‌నిలో ప‌డింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు ఒక్క‌సారిగా ఈ షోకోసం ఆహా-తెలుగు ఓటీటీ యాప్ ని అనుస‌రించ‌డం ఒక ప్ర‌కంప‌నం. ఇది ఆహా జైత్ర‌యాత్ర‌లో ఒక అసాధార‌ణ ప్ర‌క్రియ‌గా ప‌రిగ‌ణిస్తున్నారు.

మోస్ట్ అవైటెడ్ 2022 ఇయ‌ర్ ఎండ్ ప్రీమియర్ కు ముందు ఆహా మోసపూరిత వెబ్ సైట్ లపై కాపీరైట్ కేసుల‌ను దాఖలు చేసింది. ఎపిసోడ్ పైరేటెడ్ లీక్ అవుతుందనే భయంతో 'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తున్న 265 వెబ్ సైట్ లు .. రెండవ సీజన్ ను స్ట్రీమింగ్ చేస్తున్న 64 వెబ్ సైట్ లపై ఆహా కోర్టు కేసును దాఖలు చేసింది.

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ షో మ‌రోసారి పెద్ద ఎత్తున పైర‌సీకి గుర‌వుతుంద‌ని అంచ‌నా వేసిన ఆహా ఓటీటీ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలే చేసింది. ఆహా వీడియో ఏదైనా కంటెంట్ ను ప్రసారం చేయకుండా పైరేటెడ్ వెబ్ సైట్ లు ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లకు వ్యతిరేకంగా కోర్టు నిషేధాన్ని ఆదేశించింది.

ద్వారా కాపీరైట్ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే స‌ద‌రు వెబ్ సైట్ల‌కు తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని కూడా కోర్టు హెచ్చ‌రించింది. ఉత్త‌రాదిన ప్ర‌భాస్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అక్క‌డ ప‌లు వెబ్ సైట్ లు అత‌డికి సంబంధించిన గాసిప్పుల‌ను వైర‌ల్ చేయ‌డం లేదా అతడి షోలు ఇంట‌ర్వ్యూలను పైరేట్ చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాయ‌న్న స‌మాచారం ఉంది. ఇప్పుడు ఆహాలో ప్ర‌భాస్-ఎన్.బి.కే అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్ ని కాపీ చేసేందుకు పైరేట్ లు వెయిట్ చేస్తున్నారు. అలాంటిది జ‌ర‌గ‌కుండా కాస్త‌ ముందుగానే ఆహా బృందాలు కోర్టును ఆశ్ర‌యించాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News