వరల్డ్ టాప్-5లో దంగల్

Update: 2017-06-15 04:38 GMT
కొన్ని వారాలుగా బాహుబలి2 సృష్టించిన సెన్సేషనల్ రికార్డుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇదే సమయంలో చైనాలో విడుదలైన ఆమిర్ ఖాన్ మూవీ దంగల్.. అక్కడ అనూహ్యమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ దంగల్ మరో అరుదైన రికార్డును సృష్టించేసిందని ఫోర్బ్స్ నివేదిక అంటోంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించడం అంటే ఇంగ్లీష్ సినిమాలకే సాధ్యం. కానీ అరుదుగా ఆ స్థాయిలో వసూళ్లను ఇతర భాషల చిత్రాలు పొందుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్-ఇంగ్లీష్ మూవీల జాబితాలో.. దంగల్ కు ఇప్పుడు ఐదో స్థానం దక్కింది. ది మెర్మెయిడ్(చైనా) 553 మిలియన్ల యూఎస్ డాలర్లను వసూలు చేసి మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ది ఇన్ టచబుల్స్(ఫ్రాన్స్)(తెలుగులో దీన్నే ఊపిరిగా రీమేక్ చేశారు) 427 మిలియన్ డాలర్లు.. మాన్ స్టర్ హంట్(చైనా) 386 మిలియన్ డాలర్లను.. యువర్ నేమ్(జపాన్) 354 మిలియన్ డాలర్లను వసూలు చేయగలిగింది.

ఇప్పుడు దంగల్ మూవీ 301 మిలియన్ డాలర్లతో వరల్డ్ టాప్ నాన్ ఇంగ్లీష్ మూవీస్ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. మన కరెన్సీలో ఇది 1930 కోట్ల రూపాయలు కాగా.. ఇందులో చైనా నుంచే 1200 కోట్లు వసూలయ్యాయి. ఇప్పటికీ చైనాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుండడంతో.. టాప్ 4కు చేరుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News