వంగ‌వీటి అస‌లెలా విడులైంది?

Update: 2017-01-05 22:30 GMT
‘వంగ‌వీటి’ ట్రైల‌ర్ చూశాక ప్ర‌తి ఒక్క‌రికీ క‌లిగిన సందేహం.. అస‌లీ సినిమా విడుద‌ల‌వుతందా అనే. ఆ క‌థ‌తో ఎన్ని వివాదాలు ముడిప‌డి ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెన్సార్ ద‌గ్గ‌రే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని.. ఒకవేళ ఆ అడ్డంకిని దాటినా విజ‌య‌వాడ లాంటి ప్రాంతాల్లో సినిమాను స‌జావుగా రిలీజ్ చేయ‌డం అసాధ్య‌మ‌ని అనుకున్నారంతా. కానీ అన్ని అడ్డంకుల్నీ అధిగ‌మించి సినిమా య‌ధావిధిగా విడుద‌లైంది. రిలీజ్ త‌ర్వాత అనేక అభ్యంత‌రాలు.. వివాదాలు త‌లెత్తినా ఏ ఇబ్బందీ లేకుండా సినిమా ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగింది. ఈ విష‌యంలో త‌న రాజ‌కీయ అనుభ‌వ‌మే ప‌ని చేసింద‌ని అంటున్నాడు నిర్మాత దాస‌రి కిరణ్ కుమార్.

విజ‌య‌వాడ రౌడీ రాజ‌కీయాల నేప‌థ్యంలో తీసిన సినిమాను ప్ర‌ద‌ర్శించ‌డానికి న‌గ‌రంలోని థియేట‌ర్ల య‌జ‌మానులు వెనుకంజ వేసిన‌ప్ప‌టికీ త‌న రాజ‌కీయ అనుభ‌వంతో వారిని క‌న్విన్స్ చేసి సినిమాను స‌జావుగా రిలీజ్ చేసేలా ఒప్పించానన్నాడు దాస‌రి. వంగ‌వీటి రంగా హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో ధ్వంస‌మైన అలంకార్ థియేట‌ర్లోనూ ‘వంగ‌వీటి’ సినిమాను రిలీజయ్యేలా చేయ‌డానికి ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని కిర‌ణ్ తెలిపాడు. ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో అనేక ఇబ్బందులు ప‌డ్డ‌ప్ప‌టికీ పోలీసులు ఎంత‌గానో స‌హ‌క‌రించార‌ని.. థియేట‌ర్ల ద‌గ్గ‌ర భారీగా ద‌ళాల్ని మోహ‌రించార‌ని.. ఇందుకు వారికి తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని దాస‌రి కిర‌ణ్ కుమార్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News