ఆ హీరో నా బాయ్ ఫ్రెండ్ అనేసింది

Update: 2016-01-23 01:30 GMT
బాలీవుడ్ లో ప్రేమించడం, విడిపోవడం కొత్తేం కాదు కానీ.. ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. ఎవరైనా ప్రేమ జంట విడిపోతే, వారిద్దరూ కలిసి నటించేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు పాత ప్రియుడు - ప్రియురాలితో కొత్త సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ బాగానే ఇచ్చేస్తున్నారు. ఇలాగే దీపిక రణ్ బీర్ కపూర్ తో తమాషా చేసేసింది.

మరి ఇలా పాత ప్రియుడితో సినిమా చేయడం, లిప్ లాకుల్లో నటించడం చూస్తే.. కొత్త ప్రియుడు ఫీల్ అవ్వడా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ విషయమే దీపికాని అడిగితే, ఆమె ఇంకా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఏమో ఆ ఫీల్ నాకు ఎలా తెలుస్తుంది. వెళ్లి నా బాయ్ ఫ్రెండ్ రణ్ వీర్ ని అడగమంది దీపిక. 'నేను మంచీ చెడు అన్నీ రణ్ వీర్ తో పంచుకుంటాను. ఏ రిలేషన్ అయినా నిలవాలంటే దాపరికాలు ఉండకూడదు. అందుకే అన్నీ చెప్పేస్తాను' అనేసింది దీపిక. ఈ భామ చెప్పింది కూడా కరెక్టే.. ఓ మగవాడు ఎలా ఫీలవుతాడో ఆడపిల్లను అడిగితే తెలుస్తుంది. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటుంది.

మొదటి సారిగా దీపికా పదుకునే నా బాయ్ ఫ్రెండ్ రణ్ వీర్ అనే మాట ఉపయోగించింది. ఇప్పటివరకూ నాకు రణ్ వీర్ మంచి ఫ్రెండ్ అని మాత్రమే అనేది. ఇంటెన్సిటీ గురించి మాత్రం పెదవి విప్పేది కాదు. ఇప్పుడు మాత్రం నా బాయ్ ఫ్రెండ్ అనడంతో.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. బహుశా ఇక తమ రిలేషన్ ని మెల్లగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ప్రారంభించడంలో భాగమే ఇదంతా అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.
Tags:    

Similar News