బికినీ అందాల‌తో బంతాడేస్తోన్న దీపికా ప‌దుకొణే!

Update: 2022-12-09 06:48 GMT
బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే వ‌రుస షూటింగ్ ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌ఠాన్..జవాన్..ప్రాజెక్ట్-కె...ఫైట‌ర్ చిత్రాల‌తో ఊపిరాడ‌నంత బిజీగా ఉంది. గెహ్ర‌యాన్ లో త‌న‌దైన హాట్ పెర్పార్మెన్స్ తో చెల‌రేగిన త‌ర్వాత అమ్మ‌డిని మ‌ళ్లీ  వెండి తెర‌పై చూడాలని అభిమానులంతా త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు. ఈసారి ఇంకెంత అందంగా క‌నిపిస్తుందో? అంటూ ఒకటే ఎగ్టైట్మెంట్  తో ఎదురు చూస్తున్నారు.

'సిర్క‌స్' చిత్రంలో ర‌ణ‌వీర్ తో  తెర‌ను పంచుకున్నా? అందులో దీపిక ఊసురు మ‌నిపించింది. ఎలాంటి రొమాన్స్  కి తావు ఇవ్వ‌కుండా కేవ‌లం పెర్పార్మెన్స్ తోనే ఆక‌ట్టుకుంది. హ‌బ్బీతో ఐంట పాట‌లో రెచ్చిపోతుంద‌నుకున్నారంతా?  కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స్ లో క‌నిపించింది. ఇక ఆశ‌ల‌న్నీ ప‌ఠాన్ పైనే క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఓ సాంగ్ లో బికినీ ధ‌రించి క‌నిపించింది.

ఆ పాట‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలోని  'బేషరమ్ రంగ్' సాంగ్  డిసెంబర్ 12న  విడుదల కానుంది. ఈ పాటలోని ఒక స్టిల్ ఇప్పుడు నెట్టింట‌ వైర‌ల్  గా మారింది. దీపిక గోల్డెన్ బికినీలో  అగ్గి రాజేసే అందాల‌తో వావ్ అనిపిస్తుంది.  స్టిల్ చూసిన తర్వాత  కాక్‌టెయిల్‌లోని పాతకాలపు దీపికనే స్మ‌రిస్తుంది. అమ్మ‌డి త‌డిపోడి అందాలు హైలైట్ అవుతున్నాయి.

దీపిక స్కిన్ టోన్..పాల నురుగుల అందానికి అంతా ఫిదా అవుతున్నారు. వృత్తాకారపు బంగారు చెవిపోగులు అమ్మ‌డిని మ‌రింత అందంగా..హాట్ గా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. క‌వ‌ర్ పేజీ స్టిల్ త‌ర‌హాలో ప‌ఠాన్ స్టిల్ అభిమానుల్లో మంట‌లు పుట్టిస్తుంది. ఆ పాట ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అని యాంగ్టైటీ పెరిగిపోతుంది.

అంతేనా సినిమాలో అమ్మ‌డు ఇంత‌కు మించిన సాహ‌సాలు చేసేసింది. కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ స్టంట్స్ కూడా చేసింది. షారుక్ తో పోటీ ప‌డిమ‌రీ వాటిలో న‌టించిన‌ట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో విలన్‌గా జాన్ అబ్రహం నటిస్తున్నాడు. ఈ సినిమా  జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News