సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతాయో అర్థం కావు.. కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయో ఎంత ఆలోచించినా కూడా తెలియదు. కొన్ని సినిమాలకు రివ్యూలు పాజిటివ్ గా వస్తే కలెక్షన్స్ నెగటివ్ గా వస్తాయి. కొన్ని సినిమాలకు రివ్యూలు నెగటివ్ గా వచ్చినా కమర్షియల్ గా హిట్ అనిపించుకుంటుంది. ఇలా ఎన్నో సార్లు జరిగింది. ప్రస్థానం సినిమా విషయంలో కూడా అదే జరిగింది. దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం సినిమాను ఒక అద్బుతంగా అంతా అభివర్ణిస్తూ ఉంటారు. అలాంటి ప్రస్థానం సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా రీమేక్ అయ్యి రెండు కోట్ల నిర్మాతలకు బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది.
ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా కూడా దర్శకుడు దేవా కట్టాకు మంచి క్రేజ్ ను ఆ సినిమా తెచ్చి పెట్టింది. ఎట్టకేలకు ఆ సినిమా ఫ్లాప్ విషయమై దేవ కట్టా స్పందించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రస్థానం చిత్రం విషయంలో తాను ఎప్పుడు నిరాశ పడలేదన్నాడు. తెలుగులో ఈ సినిమా విడుదల అయిన సమయంలో డార్లింగ్ మరియు సింహా సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాల ముందు ఇది నిలువలేక పోయింది. దాంతో కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదన్నాడు.
ఇక హిందీలో చాలా నమ్మకంతో ఈ సినిమాను రీమేక్ చేశాము. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు అన్నట్లుగా సినిమా కథలో మార్పులు చేశాము. అయితే ఆ మార్పులు సంజయ్ దత్ కు సెట్ అవ్వలేదు. అలాగే సినిమాకు ప్రమోషన్ ను సరిగా చేయలేక పోవడంతో పాటు సరైన సమయంలో సినిమాను విడుదల చేయడంలో విఫలం అయ్యాము. సంజయ్ దత్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఎంతో ఇష్టపడి ఈ రీమేక్ ను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు చాలా నచ్చిన పాత్ర అవ్వడంతో చాలా కష్టపడి చేశారు. చిన్న చిన్న కారణాల వల్ల హిందీలో కూడా ప్రస్థానం నిరాశ పర్చిందని దేవకట్టా అభిప్రాయ పడ్డాడు.