‘గీత గోవిందం’ చిత్రంతో రష్మిక మందన్న ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండకు ఏమాత్రం తీసిపోకుండా ‘గీత గోవిందం’ చిత్రంలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రష్మిక సినిమా సక్సెస్ లో కీలక భూమిక పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చిత్రం తర్వాత రష్మికకు కోటికి పైగా పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో రష్మిక నటించిన ‘దేవదాస్’ చిత్రం విడుదల కాబోతుంది.
‘దేవదాస్’ చిత్ర యూనిట్ సభ్యులు రష్మిక ఇమేజ్ ను వాడుకోవడంలో విఫలం అయ్యారని, ఆమెకు గీతగా వచ్చిన క్రేజ్ ను వాడుకుని ఇంకాస్త ఎక్కువగా దేవదాస్ కు ప్రమోషన్స్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా వారు ఉపయోగించుకోలేక పోయారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేవదాస్’ లో ఇద్దరు హీరోలు ఉండటంతో వారితోనే తమ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ వచ్చిందని మేకర్స్ భావించారో లేక మరేంటో కాని అసలు రష్మికను ఏమాత్రం ప్రత్యేకంగా వాడినట్లుగా అనిపించలేదు.
‘దేవదాస్’ చిత్రంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ కూడా నటించిన విషయం తెల్సిందే. ఆకాంక్ష సింగ్ ను ప్రమోషన్స్ లో ఎలా అయితే వాడారో అంతే స్థాయిలో రష్మికను కూడా వాడారు తప్ప - రష్మికకు ప్రమోషన్స్‌లో ఎక్కువ స్థానం కల్పించడం కాని - ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూలు లేదా కార్యక్రమాలు చేయించడం వంటివి చేయలేదు. రష్మికను ఫోకస్ లో పెట్టి ప్రమోషన్స్ చేస్తే పబ్లిసిటీ మరింత ఎక్కువ దక్కేదని - 100 కోట్ల హీరోయిన్ ను దేవదాస్ లు వినియోగించుకోవడంలో దారుణంగా విఫలం అయ్యారు అంటూ సోషల్ మీడియాలో కూడా టాక్ వినిపిస్తుంది.