బాలీవుడ్ ని దశాబ్ధాల పాటు ఏలిన కింగ్ ఖాన్ షారూక్ కి వరుసగా రెండు డిజాస్టర్లు రావడంతోనే అతడి కెరీర్ గ్రాఫ్ ఏ స్థాయికి పడిపోయిందో తెలిసిందే. ఖాన్ ఐదేళ్లు ఖాళీగా ఉన్నాడు. ఈ ఏడాదిలో రెండు భారీ డిజాస్టర్లతో బాలీవుడ్ లో ఖిలాడీ అక్షయ్ కుమార్ అంతటి వాడి గ్రాఫే కిందకి పడిపోయింది. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సన్నివేశం అంతకంటే గొప్పగా ఏం లేదు. లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ తో అతడు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
అదంతా సరే కానీ.. 2022లో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ డిజాస్టర్లను ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ సన్నివేశం ఎలా ఉండబోతోంది? అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. రమేష్ వర్మ తెరకెక్కించిన `ఖిలాడీ` తో పాటు శరత్ మండవ దర్శకత్వం వహించిన `రామారావు ఆన్ డ్యూటీ` కూడా డిజాస్టర్ల జాబితాలో చేరిపోయి రవితేజను తీవ్రంగా నిరాశపరిచాయి.
కరోనా తర్వాత నిజానికి టాలీవుడ్ కంబ్యాక్ అయిన తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. సీనియర్ హీరోలు చిరంజీవి -బాలకృష్ణ సైతం బ్లాక్ బస్టర్లతో జోష్ మీద ఉన్న వేళ.. మాస్ రాజాకు మాత్రం వరుసగా ఊహించని ఘోరపరాభవాలు ఎదురయ్యాయి. 2022లో టాప్ 5 డిజాస్టర్ల జాబితాను తిరగేస్తే రవితేజ నటించిన రెండు సినిమాలు ఇందులో ఉంటాయి. అట్టర్ ఫ్లాపుల రూపంలో అవి రవితేజకు జీవితాంతం మర్చిపోలేని పీడ కలగా మిగిలాయి.
అయితే ఈ ఘోర పరాజయాల నుంచి అతడిని ఇప్పుడు `ధమాకా` బయట పడేస్తుందా? త్రినాథరావు ఆశించిన హిట్టిస్తాడా? అన్న ప్రశ్న అభిమానులను నిలవనీయడం లేదు. ఈర్ ఎండ్ లో రాజా ధమాకా మోగిస్తాడా లేదా? అన్న ఉత్కంఠ నడుమ రాజా సినిమా ఈ డిసెంబర్ 23న విడుదలవుతోంది. ఈ రాత్రికి అమెరికా ప్రీమియర్ల నుంచి ట్విట్టర్ రివ్యూలు కూడా వచ్చేస్తాయి. బ్లాక్ బస్టర్ సంగతేమో కానీ క్రిస్మస్ పండగ ముందు కనీసం హిట్టు అనిపించుకున్నా రాజాకు అది ఎంతో మేలు చేస్తుంది.
ఒకవేళ ఫలితం తారుమారు అయితే గనుక ఇక నిర్మాతలు ఎవరూ అతడిని నమ్మే అవకాశం ఉండదు. మళ్లీ అతడు మరో `క్రాక్` లాంటిది పట్టాలంటే అంత సులువేమీ కాదు! అన్నట్టు రవితేజ పై బిగ్ హోప్స్ తో ఉన్న పీపుల్స్ మీడియాకు ఊరట కలిగే ఫలితం దక్కుతుందా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. రాజాను నమ్మి అవకాశాలిచ్చేంతటి చక్కని విజయం ఇప్పుడు అవసరం. మరి అందరూ ఆశిస్తున్నట్టు అతడు మాస్ `ధమాకా` మోగిస్తాడా లేదా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.