ధనలక్ష్మి తలుపు తడితే.. ఈ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. కమెడియన్ ధన్ రాజ్ కోప్రొడ్యూసర్ గా మారి పెట్టుబడులు పెట్టిన చిత్రమిది. టైటిల్ లోనే తన పేరును ఇమిడ్చేసుకున్న ధన్‌రాజ్ ని నిజంగానే ఈ సినిమా రూపంలో ధనలక్ష్మి వరించిందా? తలుపు తట్టిందంటారా? ఏమో .. ఈ సినిమా రివ్యూలు మాత్రం డీసెంట్ కామెడీ ఫిలిం, ధన్ రాజ్ బాగా నటించాడంటూ ప్రశంసించాయి. మంచి రేటింగునిచ్చి గౌరవించాయి. అసలు సినిమాలో విషయం ఎంత? అనేది పరిశీలిస్తే .. ఒక మంత్రి గారి కూతురిని కిడ్నాప్ చేసి కోటి డిమాండ్ చేసిన కిడ్నాప్ గ్యాంగ్ కథ సుఖాంతమైందా? లేదా? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ధన్ రాజ్ అండ్ గ్యాంగ్ చేసిందేమిటి? అన్నది తెరపైనే చూడాల్సిందే.
కోడి (ధన్ రాజ్) అండ్ గ్యాంగ్ ప్రవేశించి ఆ చిన్నారిని వెతికి పట్టుకుని మంత్రిగారికి అందజేయడమే అంతిమ లక్ష్యం. అయితే ఈ కిడ్నాప్ స్టోరి లో కోడి పేరుతో ధన్ రాజ్ చక్కని కామెడీ చేశాడని ప్రశంసలొచ్చాయి. పరిమిత బడ్జెట్ సినిమా కాబట్టి టెక్నికల్ గా మరీ అంత పెద్ద స్థాయిని అంచనా వేయడానికి లేదు. కథలో క్యారెక్టర్లు కరెక్టుగా ప్రవర్తించి ఆకట్టుకున్నాయని పేరొచ్చింది. ఫర్వాలేదు అన్న టాక్ వచ్చింది అంటే ధన్ రాజ్ పెట్టుబడులు తిరిగి చేతికొచ్చేసే అవకాశం ఉంది. ఆ రకంగా అతడు సేఫ్ జోన్ లో ఉన్నట్టే.