ఏవైనా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి అంటేనే థియేటర్ల సమస్య వస్తుంది. అలాంటిది ఒకే రోజు క్రేజ్ ఉన్నవి నాలుగైదు వస్తే బయ్యర్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. డిసెంబర్ 21 ఇదే విషయంలో ఇప్పటి నుంచే గుబులు రేపుతోంది. శర్వానంద్ పడి పడి లేచే మనసుతో పాటు వరుణ్ తేజ్ అంతరిక్షం ఇంతకు ముందే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు వేర్వేరు జానర్లే అయినప్పటికీ హైప్ విషయంలో ఒకదానితో మరొకటి గట్టి పోటీనే ఇస్తున్నాయి.
మరోవైపు కన్నడ హీరో యష్ మొదటిసారి టాలీవుడ్ కు పరిచయమవుతున్న కెజిఎఫ్ కూడా మంచి ఆసక్తి రేపుతోంది. హీరో కొత్త ఫేస్ అయినప్పటికీ కంటెంట్ పరంగా ఆకట్టుకునే అంశాలు ఉండటంతో ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. రేపు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హైదరాబాద్ లో భారీ వేడుక కూడా నిర్వహించబోతున్నారు. అసలే ట్రయాంగిల్ వార్ అనుకుంటూ ఉంటే ఇప్పుడు ధనుష్ తోడయ్యాడు. మారి 2 తమిళ్ వెర్షన్ తో తెలుగు డబ్బింగ్ కూడా అదే రోజు విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారు. పోటీ నేపథ్యంలో వస్తుందా రాదా అనుమానాలు నిన్న దాకా ఉన్నాయి కానీ ఈ రోజు పోస్టర్ కూడా రిలీజ్ చేసారు కాబట్టి అనుమానాలకు తెరపడినట్టే.
సాయి పల్లవి ఆటో డ్రైవర్ అవతారం మాస్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ ప్లాప్ అయినప్పటికీ దర్శకుడు బాలాజీ మోహన్ దీన్ని మంచి మసాలా ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ లో అర్థమైపోయింది. ఇప్పుడీ మారి 2 డిసెంబర్ 21 రేస్ లో తోడయ్యింది కాబట్టి పోటీ ఇంకా పెరిగింది. నాలుగు సినిమాలకు థియేటర్ల చిక్కు అనుకుంటే మరోవైపు షారుఖ్ ఖాన్ జీరోతో అదే రోజు రచ్చ చేసేందుకు వస్తున్నాడు. చూస్తుంటే తక్కువ స్క్రీన్లు ఉన్న సెంటర్లలో ఇబ్బందులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఎవరైనా వెనక్కు తగ్గుతారేమో అనుకుంటే ఆ ఛాన్స్ దాదాపు లేనట్టే