గొలుసుల‌తో బాడీని అలా బంధీని చేసేస్తావా?

Update: 2022-10-30 11:30 GMT
మోడ్ర‌న్ బ్యూటీ  డయానా పెంటీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.  స్టైల్ కా బాప్ అనిపించే ఫోజుల‌తో నెట్టింట సంచ‌ల‌నం  అవ్వ‌డ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన మార్క్ క‌నిపిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లో  ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్ ఫీల్ని అందిస్తుంది. తాజాగా బ్యూటీ కొత్త అటెంప్ట్ మ‌రోసారి నెట్టింట‌ చ‌ర్చ‌నీయాంశమైంది.

ఇదిగో ఇక్క‌డిలో డిజైన‌ర్ దుస్తుల పేరుతో బాడీని ఎంత‌లా! ఇబ్బంది పెట్టేస్తోందో చూస్తేనే తెలుస్తోంది. బాట‌మ్ లో  న‌లుపురంగు దుస్తుల్లో..టాప్ లో స‌న్న‌ని ర‌విక‌ని అనుకుని డిజైన్ చేసి గొలుసుల బొందులు చూస్తే ఇందేం డిజైన్ అన‌డం స‌బ‌బే. వీపు అందాల్ని ఆర‌బోస్తూ గొలుసుల ప్ర‌త్యేక‌త‌ని హైలైట్ చేస్తోంది.

సిట్టింగ్ పొజిష‌న్ లో అమ్మ‌డి వ‌య్యారి భంగిమ యువ‌త‌లో స‌ల‌ప‌రం పుట్టిస్తుంది. ప్ర‌స్తుతం  ఈఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. డ‌యానా  అభిమానులు స్టైలిష్ గా క‌నిపించేలాంటే? అది నీ త‌ర్వాతే అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గ‌తంలో ఇదే త‌ర‌హా అటెంప్ట్ చేసింది. అప్పుడు ఎద అందాల్ని బంధీ చేసింది. ఈసారి రివ‌ర్స్ లో వ‌చ్చి  సెగ‌లు పుట్టిస్తోంది. మ‌రి నెక్స్ట్ ఏంటో?  చూడాలి.

ఒక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే  `కాక్ టైల్` తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటుపై  `హ్యాపీ భాగ్ జాయేగి`.. `లక్నో సెంట్రల్`.. `పరమాణు: ది స్టొరీ ఆఫ్ పోఖ్రాన్` లాంటి ఇంకా మరికొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవేమి అమ్మ‌డికి  అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ప్ర‌స్తుతం `సెల్పీ`..`అద్భుత్` చిత్రాల్లో న‌టిస్తోంది. అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ ఈ రెండు సినిమాల‌పైనే ఉన్నాయి.

వీటితోనైనా స‌క్సెస్ అందుకుని గెలుపు రేసులో నిల‌వాల‌ని ఆశ‌ప‌డుతుంది. మ‌రి బ్యూటీ టైమ్ ఎలా ఉందో?  చూడాలి.  డ‌యానా వైపు టాలీవుడ్ కూడా చూడ‌టం లేదు. ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో సినిమాలో  ఐటం పాట ఛాన్స్ చేజార్చుకుంది. చివ‌రి నిమిషంలో ఆ ఛాన్స్ మ‌రో హీరోయిన్ త‌న్నుకుపోవ‌డంతో అక్క‌డా డాయానా బ్యాడ్ టైమ్ బ‌య‌ట ప‌డింది. మ‌రి ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనుకులాంగా ఉన్నాయా? ప్ర‌తి కూలంగా ఉన్నాయా? అన్న‌ది ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌.
Tags:    

Similar News