మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారనే వార్తలు వచ్చిన వెంటనే.. ఆ మల్టీస్టారర్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. హీరోలుగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఎందుకంటే ఒరిజినల్ వెర్సన్ లో హీరోల పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటాపోటీగా ఉంటాయి. ఇద్దరిని బ్యాలన్స్ చేస్తూ మూవీ చేయాల్సి ఉంటుంది.
అందుకే మలయాళ కథను మనవాళ్లకు ఎక్కేలా తెరకెక్కించగలరా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఏకే రీమేక్ గా వచ్చిన ''భీమ్లా నాయక్'' సినిమా అందరికి బాక్సాఫీస్ వద్ద సమాధానం చెప్పింది. ఏకే చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ పోషించిన పాత్రలో రానా దగ్గుబాటి అని మేకర్స్ ముందే ఫిక్స్ అయ్యారు.
బిజూ మీనన్ రోల్ కోసం అనేక మంది హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి కానీ.. చివరకు పవన్ కళ్యాణ్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు సన్నిహితులు త్రివిక్రమ్ శ్రీనివాస్ & నిర్మాత నాగవంశీ. సాగర్ కె చంద్రకు దర్శకత్వం అప్పజెప్పి.. స్క్రీన్ ప్లే లో మార్పులు చేర్పులు - మాటలు రాసే బాధ్యత తీసుకున్నారు త్రివిక్రమ్.
అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ లో చేంజెస్ చేస్తున్నట్టు బయటకు వచ్చింది. దీంతో రానా పాత్ర నామమాత్రంగా ఉంటుందని కామెంట్స్ వచ్చాయి. ప్రమోషన్ కంటెంట్ వదిలిన తర్వాత రానా ని విలన్ ని చేశారు అన్నారు. ''భీమ్లా నాయక్'' అని పవన్ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడంతో.. ఇది సోలో హీరో సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు.
'భీమ్లా నాయక్' సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు వినిపించకపోవడం గమనార్హం. పవన్ కోసం చేసిన మార్పులు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోగా.. రానాకు కూడా సమ ప్రాధాన్యత ఉందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న మాజీ సైనికాధికారిగా రానా అద్భుతంగా నటించారు.
అయితే రానా దగ్గుబాటి కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ను డామినేట్ చేశాడని కొన్ని వర్గాల ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లోని కొన్ని సన్నివేశాలు.. డేనియల్ శేఖర్ తండ్రి మరియు భార్యతో మాట్లాడే సీన్స్.. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
మలయాళంలో కథ మొత్తం కొశీ (తెలుగులో రానా పోషించిన పాత్ర) వైపు నుండి ఉండగా.. తెలుగులో మాత్రం భీమ్లా నాయక్ వైపు నుంచి కథ చెప్పాలని అనుకున్నామని త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సెస్ మీట్ లో వెల్లడించారు. అందుకే భీమ్లా క్యారెక్టర్ కు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అయినప్పటికీ రానా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో డామినేట్ చేసారనే కామెంట్స్ వస్తున్నాయి.
రానా బాబాయ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ వంటి చాలా మంది ప్రముఖులు అతని ఇంటెన్స్ నటనకు ప్రశంసలు కురిపించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసేదేం లేదు. అతని కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో నుంచి ఎలాంటి పాత్రను ఎక్సపెక్ట్ చేశారో.. అలాంటి రోల్ లో అదరగొట్టారు. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ ''భీమ్లా నాయక్'' బీభత్సం కనిపిస్తోంది. ప్రధాన నటీనటుల నటనకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ - సాగర్ కె చంద్ర టేకింగ్ జత చేరి బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.