సంక్రాంతి సందర్భంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
ఈ రెండు సినిమాలకు తోడు దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా కూడా తమిళంతో పాటు తెలుగు లో భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. తెలుగు మరియు తమిళంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో వారసుడు సినిమాను దిల్ రాజు నిర్మించాడనే వార్తలు వస్తున్నాయి. కనుక ఆ స్థాయిలోనే విడుదల చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమాను ఒక డబ్బింగ్ సినిమా అన్నట్లుగా కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా అన్నట్లుగా మెజార్టీ థియేటర్లలో విడుదల చేయాలని దిల్ రాజు కసరత్తు మొదలు పెట్టాడు. చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాల కంటే కూడా అధికంగా వారసుడు సినిమా కు థియేటర్లు లభించే అవకాశం ఉంది అంటున్నారు.
ఈ సమయంలో యూఎస్ లో కూడా వారసుడు సినిమా ను మెజార్టీ స్క్రీన్స్ లో విడుదల చేసే విధంగా అక్కడి డిస్టిబ్యూటర్స్ ను దిల్ రాజు ఒత్తిడి చేస్తున్నాడట. అక్కడ తనకు ఉన్న పరిచయాలు మరియు ముందు ముందు తన నుంచి రాబోతున్న సినిమాల పేరు చెప్పి యూఎస్ లో వారసుడు ను మెజార్టీ స్క్రీన్స్ లో విడుదల చేయడం కన్ఫర్మ్ అయ్యింది.
ఇప్పటి వరకు యూఎస్ లో వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలకు సంబంధించి ఎలాంటి హడావుడి లేదు. ఇంకా అక్కడ స్క్రీన్స్ కు సంబంధించిన చర్చ కూడా మొదలు అయినట్లుగా కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సంక్రాంతి సీజన్ పై తన డామినేషన్ ను దిల్ రాజు అప్పుడే షురూ చేసినట్లుగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.