ఆయనకు ఫ్రీడం ఇచ్చేసిన రాజుగారు!

Update: 2019-04-26 06:33 GMT
తమిళ సూపర్ హిట్ '96' రీమేక్ ను తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున సంగతి తెలిసిందే.  ఈ రీమేక్ లో విజయ్ సేతుపతి - త్రిష పాత్రలను శర్వానంద్ - సమంతాలు పోషిస్తున్నారు.  ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు. ఈ రీమేక్ విషయంలో రాజుగారి ప్రమేయం ఎక్కువగా ఉందని చాలారోజుల నుండి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఇన్వాల్వ్ కావడం మానేసి దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇచ్చారట.

తమిళంలో క్లాసిక్ ఫిలింగా నిలిచిపోయిన '96'ను సినిమా రిలీజ్ కంటే ముందే నమ్మినవారిలో దిల్ రాజు ఒకరు.  అయన అప్పుడే తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ స్లోగా సాగుతుంది. దీంతో తెలుగు వెర్షన్ కు కొన్ని మార్పులు చేయాలని మొదట దిల్ రాజు భావించారు. ఒరిజినల్ దర్శకుడినే తీసుకున్నప్పటికీ.. సంగీతం కోసం దేవీ శ్రీ ప్రసాద్ ను తీసుకోవాలని అనుకున్నారు.. దానికి తోడు ఎంటర్టైన్మెంట్ ను కూడా కాస్త జోడిస్తే తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవుతుందని దర్శకుడికి చెప్పారట. కానీ ప్రేమ్ కుమార్ మాత్రం అలా చేస్తే సినిమాలో సోల్ దెబ్బ తింటుందని రాజుగారి సూచనలను ఒప్పుకోలేదట. అందుకే ప్రేమ్ కుమార్ కోరినట్టే ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద వసంతనే ఈ సినిమాకు తీసుకున్నారు.

ఇక స్క్రిప్ట్ విషయంలో  మార్పుచేర్పులు వద్దని దర్శకుడు పట్టుబట్టడంతో ఫైనల్ గా ఈ సినిమా విషయం డైరెక్టర్ కే వదిలేశాడట.  సినిమా మేకింగ్ విషయంలో జోక్యం చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడట. అందుకే ఇప్పుడు '96' రీమేక్ పూర్తిగా డైరెక్టర్ టేస్ట్ ప్రకారమే తెరకెక్కుతోందని సమాచారం.
Tags:    

Similar News