ఉగాది లోపే టైటిల్ ఫిక్స్ చెయ్యాలా?

Update: 2019-02-25 05:37 GMT
తమిళంలో భారీ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలి అంటే...అది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే...టైటిల్ నుంచి సినిమా సీన్ వరకూ ఫర్స్ట్ షాట్ నుంచి క్లైమాక్స్ వరకూ అన్నీ మన నేటివిటీకి తగ్గట్టుగానే చూసుకోవాలి... అప్పుడే సినిమా మంచి హిట్ అందుకుంటుంది... అలా కాకుండా ఏమాత్రం అజాగ్రత్త వహించి మక్కికి మక్కీ దించినా సినిమా ఫలితం మొత్తం తారుమారు అయిపోతుంది... అయితే అలాంటి పనిలోనే బిజీగా ఉన్నాడు మన ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అవును దిల్ రాజు ఇప్పుడు చాలా బిజీ...ఎందుకంటే తమిళం సూపర్ హిట్ అయిన 96 సినిమా రైట్స్ ను దిల్ రాజు కొని...దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాణం విషయంలో దిల్ రాజు చాలా కేర్ తీసుకుంటున్నాడట... ముందుగా ఈ సినిమా టైటిల్ ను 96 గా కాకుండా వేరే ఏదో ఒకటి పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నాడు... దానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ కధను 1996 కి తీసుకు వెళ్ళాలి అంటే, శర్వానంద్ ను మరీ ముదిరిపోయిన ముసలి వాడిలా చూపించాల్సి వస్తుంది అని.. పైగా ఇలాంటి టైటిల్స్ వల్ల తెలుగు ప్రేక్షకులు ఇబ్బంది పడి సినిమా చూసే ఆసక్తి కనబరచరు అని... ఇలాంటి టైటిల్ తో ముందుకు పోతే రిస్క్ చేసినట్లే అన్నది దిల్ రాజు పాయింట్... ఈ క్రమంలోనే ఈ సినిమాకు మంచి టైటిల్ ఆలోచించి... ఆ టైటిల్ ను ఆధారంగా చేసుకుని రానున్న ఉగాదికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాలి అన్నది దిల్ రాజు ఆలోచన.

అందుకోసం టైటిల్స్ వేటలో పడ్డాడట మన నిర్మాత. అదే క్రమంలో ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా ఆ ఫీల్ క్యారీ అయ్యేలా... దానికి తగినట్లుగానే టైటిల్ ఆలోచించి, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ పెంచాలి అన్నది దిల్ రాజు ప్లాన్ లో భాగం. అయితే ఆలోచన అయితే బాగానే ఉంది కానీ, ఇంతటి స్లో స్క్రీన్ ప్లే ఉన్న సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి... ఎందుకంటే మన వాళ్ళకి సాగతీత నచ్చదు కదా!
Tags:    

Similar News