దిల్ రాజు.. టాలీవుడ్‌లో ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజుకున్న అభిరుచి, జడ్జిమెంట్ పవర్ ఇంకెవరికీ లేదనే చెప్పాలి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఏ సినిమా తీసినా తన ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు రాజు. మొదట్లో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసిన రాజు.. మధ్యలో వరుసగా భారీ సినిమాలు చేసిన రాజు.. ఈ మధ్య మళ్లీ చిన్న సినిమాల వైపు అడుగులేస్తున్నారు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో కొత్త వాళ్లతో ఆయన తీసిన 'కేరింత' బాగానే ఆడుతోంది. ఐతే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి.. అసలిలాంటి చిన్న సినిమా ఎందుకు తీశానా అని బాధపడినట్లు చెప్పాడు రాజు.
''కొత్త వాళ్లతో సినిమా అంటే నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. కేరింత ప్రివ్యూ చూసినపుడు కచ్చితంగా హిట్టవుతుందన్న నమ్మకం కలిగింది. ఐతే తొలి రోజు ఓపెనింగ్స్ సరిగా లేకపోవడంతో బాధపడ్డాను. మా సంస్థ నిర్మించిన సినిమాల్లోకెల్లా అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే. తొలి రోజు హైదరాబాద్‌లోని మెయిన్ థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లాను. ఇంటర్వెల్‌లో బయటకు వచ్చి.. ఆలోచిస్తుంటే ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకిలా జరిగింది.. చిన్న సినిమాలు జనాలు చూడరా? నాలాంటి పెద్ద నిర్మాత సినిమా తీస్తేనే ఇలా ఉంటే.. మామూలు నిర్మాతల పరిస్థితేంటి? చిన్న సినిమాలు తీయడం తప్పా? ఇకపై ఇలాంటి సినిమాలు తీయకూడదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఐతే సినిమా చూసిన వాళ్లు మాత్రం బాగుందన్నారు. మధ్యాహ్నం వైజాగ్ నుంచి మా మేనేజర్ ఫోన్ చేసి.. మార్నింగ్ షో డల్‌గా ఉన్నా.. మ్యాట్నీకి హౌస్‌ఫుల్ అయిందని చెప్పాడు. దాంతో టెన్షన్ నుంచి రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు సినిమా బాగా ఆడుతోంది'' అని చెప్పాడు రాజు.