మహేష్ బాణం ఎవరెవరికో తగిలింది

Update: 2019-03-05 05:29 GMT
నిన్న మహేష్ బాబు వేసిన ట్వీట్ రాత్రి ఎందరికో కునుకును దూరం చేసిందన్నది నిజం. నేరుగా ఎఫెక్ట్ అయిన వాళ్ళ లిస్టు చూసుకుంటే సుకుమార్ తో మొదలుకుని మైత్రి నిర్మాతలు-త్రివిక్రమ్ శ్రీనివాస్-అనిల్ రావిపూడిలతో కంటిన్యూ అవుతూ నిర్మాత దిల్ రాజు దాకా అలా వెళ్తూనే ఉంది. ఎందుకంటే సుక్కుతో తన ప్రాజెక్ట్ కాన్సిల్ కావడం మహేష్ కు ఒక కోణం అయితే వచ్చే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని అనిల్ రావిపూడి సినిమాను ఆ లోపు ఫినిష్ చేయించడం మరో యాంగిల్. ఈ రెండు సరిగ్గా బాలన్స్ అవ్వాలి అంటే దిల్ రాజు కీలక పాత్ర ఇందులో చాలా ఉంటుంది.

మహర్షి సినిమాకు అంతా తానై వ్యవహరించినప్పటికీ దిల్ రాజుకు అది సోలో ప్రాజెక్ట్ కాదు. మరో ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు. సోలో నిర్మాతగా మహేష్ బాబుతో సింగల్ కార్డు మూవీ ఉండాలని దిల్ రాజు టార్గెట్. అందుకే ఎఫ్2 రిలీజ్ కు ముందే అనిల్ రావిపూడిని ముందే లాక్ చేసుకోవడం ఇప్పుడు కలిసి వస్తోంది

అయితే అనిల్ సుంకరకు మహేష్ గతంలోనే మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు అతన్నీ దిల్ రాజుతో కట్టు కట్టమని చెప్పేసాడు. ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదిక్కడ. దిల్ రాజు అందుకే ఎక్కువ ఆలోచించకుండా ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేశారని టాక్. సో దిల్ రాజు మహేష్ తో రెండు సినిమాలు వరసగా చేసిన ఆనందం అయితే ఉంటుంది కాని తాను సోలో నిర్మాత కాదనే వెలితి మాత్రం కొనసాగాక తప్పదు.

అయినా ఒక్క సినిమాకే మహేష్ డేట్లు దొరక్క నిర్మాతలు కిందా మీద పడుతుంటే దిల్ రాజు కు ఏకంగా రెండు ప్రాజెక్ట్స్ అంటే చిన్న విషయమా. అందుకే అనిల్ రావిపూడిని స్క్రిప్ట్ పనిని వేగవంతం చేయమని చెప్పేశాడట. మహర్షి ఇంకో నెల రోజుల్లో గుమ్మడి కాయ కొట్టేసుకుంటుంది. ఆ తర్వాత దాని ప్రమోషన్ ని పూర్తి చేసి కొంత గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి సెట్ లో అడుగుపెట్టేందుకు మహేష్ సన్నద్దమవుతాడు.
Tags:    

Similar News