బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దిలీప్ కుమార్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి వైద్యులు దిలీప్ కు చికిత్స అందిస్తున్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేయాలని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫైసల్ ఫారూకీ ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని అభిమానులు ప్రార్థించాలని ట్వీట్ చేశారు. అయితే, దిలీప్ కుమార్ గత ఏడాది కూడా అస్వస్థతకు గురై వారం రోజుల పాటు అసుపత్రిలో చికిత్స పొందారు.
1922 డిసెంబర్ 11న జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసుప్ ఖాన్. మొఘల్-ఏ-అజమ్ - నవ్యదౌర్ - దేవదాస్ - గంగా జమునా - కర్మ వంటి హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దిలీప్ కుమార్ తెచ్చుకున్నారు. ‘ట్రాజెడీ కింగ్’ గా పిలుచుకునే దిలీప్ కుమార్ 1998 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ లెజెండరీ నటుడిని 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 2015లో పద్మ విభూషణ్ అవార్డుతో ప్రభుత్వం గౌరవించింది. మరోవైపు, దిలీప్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.