'భీమ్లానాయ‌క్‌' పై దేవా క‌ట్టా సెన్సేష‌న‌ల్ ట్వీట్

Update: 2022-02-26 18:07 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన మాస్ మ‌సాలా హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ `భీమ్లానాయ‌క్‌`. చాలా రోజులుగా రిలీజ్ విష‌యంలో సందిగ్ధంలో వున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం భారీ స్థాయిలో ప్రేక్ష‌కు ముందుకొచ్చింది. యంగ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేశారు.

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. రానా కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలో నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్ లు గా న‌టించిన విష‌యం తెలిసిందే.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజు తొలి ఆట నుంచే ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప‌వ‌న్ ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్ చేశారు. మెగాస్టార్ నుంచి మొద‌లైన ఈ ట్వీట్ ల వ‌ర్షం ఇప్ప‌టికీ కొన‌సాగుతూ `భీమ్లానాయ‌క్‌`ని నెట్టింట మ‌రింత వైర‌ల్ గా మార్చింది.

ఫిబ్ర‌వ‌రి 25న భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం చాలా కాలంగా ఇలాంటి మాస్ జాత‌ర కోసం ఎదురుచూస్తున్న అభిమానుల‌కు పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తెచ్చింది. దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల తో పాటే ఇత‌ర రాష్ట్రాల్లోనూ .. ఓవర్సీస్ లోనూ థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ పూన‌కాల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

ట్రైల‌ర్ తో సినిమాపై హైప్ క్రియేట్ కావ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద హంగామా ఓ రేంజ్ కి చేరింది. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా రాకార్డు స్థాయిలో రావ‌డంతో ప్ర‌తీ థీయేట‌ర్ వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీపై సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రిటీలు పెడుతున్న పోస్ట్ లు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. తాజాగా ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా `భీమ్లానాయ‌క్‌` పై పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

త‌మిళనాడులోని ఓ థియేట‌ర్ లో `భీమ్లానాయ‌క్‌` సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చిన అభిమానులు సినిమా గురించి, ప‌వ‌న్ క‌ల్యాణ్ పెర్ఫార్మెన్స్ గురించి చెబుతూ పూన‌కాల‌తో ఊగిపోతున్న వీడియోని షేర్ చేసిన దేవా క‌ట్టా `భీమ్లానాయ‌క్‌` పై ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు.

``బాహుబ‌లి` త‌రువాత ఇది మ‌న తెలుగు సినిమా అంటూ. భాష‌, స‌రిహ‌ద్దులు లేకుండా ప్ర‌తీ ఒక్క‌రిని క‌లుపుకుంటూ వెళుతోంది. ఇక ఏ ఫోర్సూ తెలుగు సినిమాని ఆప‌లేదు. `భీమ్లానాయ‌క్‌`తో సూప‌ర్ స‌క్సెస్ అందుకున్న ఉస్తాద్ ప‌వ‌న్ క‌ల్యాణ్, అలాగే రానాల‌కు చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్ష‌లు` అని తెలిపారు దేవా క‌ట్ట‌. ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయ నేప‌థ్యంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా `రిప‌బ్లిక్‌` మూవీని దేవా క‌ట్టా రూపొందించిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News