మీడియా ముందు ఏడ్చేసిన డైరెక్టర్

Update: 2016-02-05 15:30 GMT
కెరీర్లో అతి పెద్ద సక్సెస్ అందుకున్నపుడు.. ఆ సక్సెస్ గురించి అందరూ పొగుడుతున్నపుడు కలిగే ఆనందమే వేరు. అందులోనూ ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే సక్సెస్ మరింత మజానిస్తుంది. తెలుగమ్మాయి సుధ కొంగర ఇప్పుడు ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సాలా ఖడూస్’కు దర్శకురాలు సుధనే. తమిళంలో ‘ఇరుండ్రు సుట్రు’ పేరుతో రిలీజైన ఈ సినిమా రెండు చోట్లా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సక్సెస్ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశంలో చాలా ఎమోషనల్ గా మాట్లాడింది సుధ.

‘‘ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ముందు సినిమా తొలి కాపీ రెడీ అయ్యాక ఓ పది పదిహేను మందికి సినిమా చూపించాను. వాళ్లందరూ ఏడ్చారు. అలా ఒక్కొక్కరికి షో చూపించినపుడల్లా రాజ్ కుమార్ హిరాని గారికి ఫోన్ చేసి మన సినిమా చూసి ఏడ్చారంటూ శాడిస్టులాగా నవ్వుతూ చెప్పేదాన్ని. ఐతే సినిమా విడుదలకు ముందు జనాలు రకరకాలుగా మాట్లాడారు. ఇది బాలీవుడ్లో మాత్రమే ఆడుతుందని.. అది కూడా మల్టీప్లెక్సులకే పరిమితమైన సినిమా అని.. నెగెటివ్ కామెంట్లు చేశారు. కానీ బాలీవుడ్లో కంటే కూడా తమిళనాట ఈ సినిమా గొప్పగా ఆడుతోంది. విడుదలకు ముందు రోజు ప్రెస్ షో దగ్గర్నుంచే నా సినిమా సక్సెస్ మొదలైంది. చాలామంది మీడియా ప్రతినిధులు ఏడుస్తూ ఫోన్ చేశారు. నాకు కూడా ఏడుపొచ్చింది. మీడియా వాళ్లు నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. 5, 4 రేటింగులతో సినిమాకు గొప్ప విజయాన్నందించారు. మా విజయాన్ని వాళ్లే సెలబ్రేట్ చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతమైంది సుధ.
Tags:    

Similar News