సాయిపల్లవి విషయం తేల్చేసిన డైరెక్టర్!

Update: 2019-03-29 04:27 GMT
ఈమధ్య తమిళ డైరెక్టర్ ఎఎల్ విజయ్ తో హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో ఉందని..త్వరలో ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.  ఆ వార్తలు కోలీవుడ్ కే పరిమితం కాకుండా సౌత్ అంతా గుప్పుమన్నాయి. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి 'కణం' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది.  ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇపుడు అదే ప్రేమ ఇప్పుడు పెళ్లిగా మారుతోందని అన్నారు.

ఈ వార్తల పట్ల సాయి పల్లవి ఫ్యాన్స్ కాస్త చిర్రుబుర్రులాడిన సంగతి కూడా తెలిసిందే.  తాజాగా ఈ వార్తలపై ఎఎల్ విజయ్ స్పందించాడు.  తమ పెళ్లివార్తలన్నీ అవాస్తవమని.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.  ఇదిలా ఉంటే సాయి పల్లవి మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

ఎఎల్ విజయ్ గతంలో హీరోయిన్ అమలా పాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం తెలిసిందే.  విడాకులకు తీసుకున్న తర్వాత ఎఎల్ విజయ్ సింగిల్ గానే ఉంటున్నాడు.  సినిమాల విషయానికి వస్తే ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవి 2' త్వరలో రిలీజ్ కానుంది.  ఈ సినిమాలో ప్రభుదేవా.. తమన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.
    

Tags:    

Similar News