ఫోటో స్టొరీ: పండగ స్పెషల్ బ్లాస్ట్

Update: 2019-06-05 17:30 GMT
దిశా పటాని గురించి అసలు ఎవరికీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనే లేదు. మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు వివరించడం ఎలానో..  ఎఆర్ రెహమాన్ గురించి సంగీత ప్రేమికులకు వివరించడం ఎలానో.. దిశా పటాని గురించి సౌందర్యోపాసకులకు వివరించడం అలా.  అందుకే దిశా ఇంట్రో గురించి మనం ఏమాత్రం టైమ్ వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మనం ఫోటోస్టొరీలోకి వెళ్ళిపోదాం.

సోషల్ మీడియాలో రెండ్రోజులకోసారి దిశా మంటలు పెడుతుంది.  ఏదో ఒక అప్డేట్ తో నెటిజనులను థ్రిల్ చేస్తూ.. అభిమానులను మురిపిస్తూ.. కాల్విన్ క్లెయిన్ వారిని ముసిముసినవ్వులు నవ్వుకునేలా చేస్తూ రెండు మూడు ఫోటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంది. ఇక చూడాలి.. నెటిజనులు వెర్రెత్తినట్టు వాటికి లైకులు కొట్టడమే పనిగా పెట్టుకుంటారు.  తాజాగా దిశ రెండు ఫోటోలను తన ఇన్స్టా ద్వారా షేర్ చేసింది. దీనికి ఆమె ప్రత్యేకమైన క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు.. బ్లాస్ట్ అవుతున్నట్టుగా ఉన్న ఎమోజిని పెట్టింది.  గ్లామర్ బాంబ్ పేల్చాను అని సింబాలిక్ గా చెప్పినట్టు.  

ఫోటోలో దిశా ఒక చిరుగుల జీన్స్ వేసుకుంది. దానికి మ్యాచింగ్ గా వైట్ టాప్ లాంటి ఇన్నర్ వేసుకుంది. ఒక చేతికి గాజు.. అదే చేతి వేలికి రింగు పెట్టుకుంది. మెడలో ఒక షార్ట్ నెక్లెస్ వేసుకుంది. బ్లీచ్ చేసిన హెయిర్ కావడంతో యమా స్టైలిష్ గా కనిపిస్తోంది.  ఇక అందాల వడ్డన గురించి చెప్పేదేముంది? ఈ విషయంలో దశదిశలా ఆమె ఘనత ఎప్పుడో వ్యాపించింది కదా.  మరో సారి అదేపని చేసి నాకేమీ తెలీదన్నట్టుగా టక్కులాడిలా వయ్యారంగా నిలబడింది. ఈ ఫోటోలు పోస్ట్ చేసి జస్ట్ నలభై నిముషాలే అయింది.. లైకులు మాత్రం మూడున్నర లక్షలు.

ఈ ఫోటోకు భారీ కామెంట్లు  వచ్చాయి.  "ప్రెట్టినెస్ + హాట్ నెస్".. "హాట్ చాకోలేట్".. "పండగ స్పెషల్ బ్లాస్ట్".. "నీ టార్గెట్ 50 మిలియన్ ఫాలోయర్లేనా" అంటూ కామెంట్లు పెట్టారు.. దిశాకు ఇన్స్టా లో ప్రస్తుతం 21.7 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఇలానే హాటు ఉద్యమం కొనసాగిస్తే 50 మిలియన్ల ఫాలోయర్ల సంఖ్య చేరుకోవడం పెద్ద కష్టం కాదేమో


Tags:    

Similar News