ఇటీవలి కాలంలో విడుదలకు ముందు ఎక్కువగా చర్చల్లో నిలిచిన సినిమా డాక్టర్ జి. పోస్టర్లు టీజర్ దశ నుంచే ఇది ఆసక్తిని పెంచింది. ఆయుష్మాన్ ఖురానా- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఎంపిక చేసుకున్న కథాంశం మంచి ఉద్దేశ్యంతో ఆసక్తిని కలిగించేదే కానీ ఆశించిన స్థాయిలో వినోదం పండలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
డాక్టర్ జి కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందించిన సినిమా. డాక్టర్ ఉదయ్ గుప్తా (ఆయుష్మాన్ ఖురానా పోషించినది) పాత్ర చుట్టూ మెజారిటీ భాగం కథాంశం రన్ అవుతుంది. అతను ఆర్థోపెడిక్స్ లో నైపుణ్యం పొందాలని అనుకుంటాడు. అయితే విధి రాత వల్ల స్త్రీల గైనకాలజీలో స్పెషలైజేషన్ ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు ఏదీ జరగదు. జీవితం ఎప్పుడూ ఇతర ప్రణాళికలను కలిగి ఉంటుంది. ఈ మార్పు అతన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేసినా కానీ ఒక రకంగా స్త్రీ కోణం నుండి పురుషత్వాన్ని అంచనా వేయడానికి అర్థం చేసుకోవడానికి హీరో పాత్రకు అవకాశాన్ని ఇస్తుంది. తద్వారా డాక్టర్ జీ కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకుంటాడు.
రకుల్ ప్రీత్ సింగ్ డా. ఫాతిమా సిద్ధిఖీగా... షెఫాలీ షా డాక్టర్. నందిని శ్రీవాస్తవ్ గా....నటించారు. డాక్టర్ జి కథాంశం ఆసక్తికరం. ఒక మంచి ఉద్ధేశంతో ఈ కథను ఎంపిక చేసుకున్నారని చెప్పాలి. సమాజంలో పురుషాధిక్యత చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించిన కథలతో అనేక సినిమాలను మనం గతంలో చూసినప్పటికీ ఇది ఆడవారి కోణంలో మన సమాజంలో చాలా సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్న సవాళ్లను హైలైట్ చేస్తూ తీసిన సినిమా. అయితే దీనికోసం కామెడీ మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. ఈ మెడికల్ క్యాంపస్ బేస్డ్ కామెడీ డ్రామాలో ఆడాళ్లను అసహ్యంగా భావించడం.. అనుచిత ప్రవర్తన.. మహిళా భాగస్వామి విజయం పట్ల అసూయ... రిలేషన్ షిప్ లో ఆధిపత్య కాంప్లెక్స్ వంటి అనేక ఇతర అంశాలు తీవ్రంగా హైలైట్ అయ్యాయి. ఈ ఆలోచనతో కథా రచయితలు చేసిన ప్రయత్నం అభినందనీయం. సౌరభ్ భరత్ - విశాల్ వాఘ్ ల ఆలోచనా విధానాన్ని ప్రశంసించాలి. బిండియా ఛబ్రియా - అరవింద్ కుమార్ ల ప్రొడక్షన్ డిజైన్ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే క్యాంపస్ వాతావరణం నేపథ్యానికి అనుగుణంగా ప్రతిదీ తీర్చిదిద్ది ఉంటుంది. దాదాపు రెండు గంటల రన్ టైమ్ ప్లస్ అని చెప్పాలి.
ఏది మైనస్? అంటే.. డాక్టర్ జికి స్క్రీన్ ప్లే మైనస్. ఈ చిత్రం ఆసక్తికరంగా ప్రారంభమైనా కానీ... వినోదం పరంగా ఎంగేజింగ్ గా లేదు. ఇది ఒక కామెడీ-డ్రామా అయినా కథనంలో ఫన్ ఎలివేట్ కాలేదు. కామెడీని ఎంతో ఎక్కువగా చూపేందుకు ఆస్కారం ఉన్నా దర్శకుడు ఫెయిలయ్యాడని చెప్పాలి. పైగా సగం వండిన వంటకం లాగా తేలిపోయింది. రచయితలు సుమిత్ సక్సేనా- సౌరభ్ భరత్- విశాల్ వాఘ్- అనుభవి కశ్యప్ (దర్శకుడు) ఈ చిత్ర కథనంపై చాలా ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది. సుమిత్ సక్సేనా రాసిన డైలాగ్ లు కనెక్ట్ కావడంలో విఫలమయ్యాయి. అమిత్ త్రివేది సంగీతం.. కేతన్ సోదా నేపథ్య సంగీతం కూడా చిత్రానికి పెద్దగా ఉపయోగపడలేదు.
నట ప్రదర్శన విషయానికి వస్తే.. బలహీనంగా రూపొందించిన పాత్ర కోసం ఆయుష్మాన్ తన సర్వస్వాన్ని అందించాడు. కానీ అది నిలబడడంలో విఫలమైంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పాత్రను బాగా పోషించింది. ఓవరాల్ గా ఈ జోడి నడుమ తెరపై కెమిస్ట్రీ ఆశించినంత పండలేదు. షీబా చద్దా అప్రయత్నంగా తన పాత్రలోని అమాయకత్వాన్ని సజీవంగా చూపించగలిగింది. అయితే షెఫాలీ షా డా. నందినిగా ఓకే. ఇతర తారాగణం సభ్యులు శ్రద్ధ -ప్రియమ్ తమ పని తాము చేసుకుపోతుంటాయి.
తుది తీర్పు పరిశీలిస్తే... మొత్తంమీద డాక్టర్ జి ఒక గొప్ప లక్ష్యంతో బయలుదేరినా మార్గంలో వెళ్లాల్సిన చోటును కనుగొనలేకపోయాడు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ నవ్వించడంలో విఫలమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.