బాహుబలి 2.. కొన్ని సందేహాలున్నాయ్

Update: 2016-06-06 17:30 GMT
బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత.. హీరో ప్రభాస్ తప్ప వేరెవరూ ఇప్పటివరకూ షూటింగ్ లో పాల్గొనలేదు. భల్లాలదేవుడు రానా - అవంతిక పాత్రధారి తమన్నాలు వాళ్ల ఇతర సినిమాలు చేసుకుంటున్నారు. దేవసేన అనుష్క అయితే సైజ్ జీరో కోసం పెరిగిన సైజ్ ను తగ్గించుకుంటోంది. ఆ తర్వాత సింగం3 - భాగమతి షూటింగ్ లలో పాల్గొనాల్సి ఉంది. పైగా బాహుబలి షూటింగ్ టైంలో ఉన్న ఫిజిక్ లో.. రానా ఇప్పుడు లేడు. సేమ్ సిట్యుయేషన్ అనుష్కది కూడా. ఇక తమ్మూ అయితే.. అభినేత్రి కోసం లావవుతున్నా అంటూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.

అసలు బాహుబలి2 షూటింగ్ స్టార్ట్ చేసినపుడు.. అప్పటికే 30శాతం కంప్లీట్ అయిందన్నారు. ఇప్పుడు 60శాతం షూటింగ్ పూర్తయింది.. అక్టోబర్ నాటికి మొత్తం ఫినిష్ అవుతుంది అని చెబుతున్నారు. ప్రభాస్ కాకుండా వేరే ఎవరూ లేకుండా షూటింగ్ ఎలా అయిపోయిందో అనేది ఓ కన్ఫ్యూజన్. పైగా ఇప్పుడు క్లయిమాక్స్ చిత్రీకరణ కోసం అందరూ వచ్చేస్తారని చెబుతున్నదీ నమ్మశక్యంగా లేదు. ఘాజీతో సహా మరికొన్ని మూవీస్ చేస్తున్న రానా.. ఇప్పటికిప్పుడు కండలు పెంచేసి మళ్లీ ఫైటింగులు చేసేస్తాడా?

అసలు అన్నిటికంటే మెయిన్ డౌట్ ఏంటంటే.. బాహుబలికి సంబంధించి అనుష్కతో ఫస్ట్ చాలానే సీన్స్ తీసేశారు. ఆ మేరకు స్వీటీపై అప్పట్లో కేరక్టర్ టీజర్ కూడా వదిలారు. అవేమీ లేకుండానే ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఆ లెక్కన అనుష్క పార్ట్ మొదట్లోనే షూటింగ్ చేసేసి ఉండచ్చు. ఇక తమన్నా పరిస్థితి కూడా ఇదే కానీ.. ఈమె కొలతల్లో మార్పులు పెద్దగా లేవు కానీ.. అవంతిక ఎపిసోడ్ షూటింగ్ కూడా మొదట్లోనే చేసేసి ఉండచ్చు. ప్రభాస్ - రానాల మధ్య ఫైటింగ్ ఎపిసోడ్స్ ఇప్పుడు షూటింగ్ చేసినా.. వాటిని గ్రాఫిక్స్ లో మిక్సింగ్ చేసేస్తారు.

చూస్తుంటే గ్రాఫికల్ వర్క్స్ తో పాటు.. ఇంటర్నేషనల్ గా అన్ని వెర్షన్స్ ను ఒకేసారి రిలీజ్ చేసేందుకే ఇంత టైం తీసుకుంటున్నారని అనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి మాత్రమే ఆన్సర్ చెప్పగల క్వశ్చన్ ఇది. నిజమేనంటారా.. జస్ట్ ఆస్కింగ్..
Tags:    

Similar News