టాలీవుడ్ నుంచి ప్రభాస్ - రామ్ చరణ్- ఎన్టీఆర్- అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ప్రపంచవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్నారు. పాన్ ఇండియా స్టార్ డమ్ సృష్టికి టాలీవుడ్ ఆద్యంగా మారింది. ఇంతలోనే శాండల్వుడ్ చరిత్రను మార్చిన రియల్ హీరోగా వెలిగాడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో అతడు సంచలనాల పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత కాంతార తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ మాలీవుడ్ నుంచి ఇప్పటివరకూ అంత పెద్ద స్టార్ డమ్ అందుకున్న యువనటుడు ఎవరూ లేరు. అయితే ఒక కేజీఎఫ్ రేంజులో తనను తాను ఆవిష్కరించుకునేందుకు దుల్కార్ సల్మాన్ ప్రయత్నిస్తున్నారన్న గుసగుస వినిపిస్తోంది. టాలీవుడ్ మాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ల వెల్లువను అతడు పోటీగా భావిస్తున్నాడు. దీనికి తాను కొనసాగింపుగా మారాలని అతడు తపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది కేవోకే అనే చిత్రంతో సాధించాలని పంతంతో ఉన్నాడట. KOK - కింగ్ ఆఫ్ కోథా మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా ప్రయత్నం. ఈ సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా తనని తాను నిరూపించుకోవాలని దుల్కర్ పంతంతో ఉన్నాడు. ఇన్నాళ్లు తనకు ఉన్న చాక్లెట్ బోయ్ గా పక్కింటబ్బాయ్ గా పిలుపందుకున్నాడు. ఈ రొటీన్ ఇమేజ్ ని దూరం పెట్టాలని కూడా తపిస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో అతడు మాస్ యాక్షన పాత్రలో నటిస్తున్నాడు. ఇది కేజీఎఫ్ రాఖీ భాయ్ తరహాలో ఉండదు. ఇది ఒక ప్రత్యేక జానర్ బ్లెండ్ మూవీ. ఇందులో దుల్కార్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అయితే రాఖీభాయ్ ని మించి పవర్ ఫుల్ గా అతడు కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే దుల్కర్ పాత్ర తీరుతెన్నుల గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
2022 సెప్టెంబరులో తమిళనాడులోని కరైకుడి సమీపంలో కేవోకే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ఫిబ్రవరికి చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం జూలై 2021లో ప్రకటించగా గుమ్మడి కాయ కార్యక్రమాన్ని 21 ఫిబ్రవరితో చిత్రబృందం పూర్తి చేసింది. దుల్కర్ సల్మాన్ 'కింగ్ ఆఫ్ కోథా' సెట్స్ లో చివరి రోజు తమ టీమ్ తో ఒక వినోదభరితమైన వీడియోను రిలీజ్ చేసారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కోత షూటింగ్ ను ప్రారంభమైన చోట అంటే కారైకుడిలో ముగించామని తెలిపారు.
దుల్కర్ సల్మాన్ పాన్-ఇండియన్ స్టార్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో హీరోగా పూర్తి బిజీగా ఉన్నాడు. అతడు తదుపరి గ్యాంగ్‌స్టర్ డ్రామా అయిన కింగ్ ఆఫ్ కోతాతో పక్కింటి అబ్బాయి ఇమేజ్‌ను దూరం చేయాలని భావిస్తున్నాడు. నూతన దర్శకుడు అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ దుల్కర్ సల్మాన్ కెరీర్ లో ఇప్పటివరకు అత్యంత కాస్ట్ లీ ప్రాజెక్ట్. తాజాగా అతడు షేర్ చేసిన వీడియోలో గ్యాంగ్ స్టర్ గెటప్ ఆసక్తిని పెంచింది. బ్లాక్ షర్ట్ ధరించి వెనుకకు దువ్వుకున్న జుట్టు.. చిన్నపాటి నెరిసిన గడ్డం చెమటలతో తడిసి టాన్ లుక్ తో కనిపిస్తున్నాడు. చేతనైతే నన్ను ఫినిష్ చేయి! అనే డైలాగ్ తో ఈ ఫన్నీ వీడియోని రిలీజ్ చేసాడు. ముగింపు ఉత్సవంలో యూనిట్ మొత్తం సంబరాలు చేసుకున్నారు. దుల్కార్ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఈ సరదా వీడియోను షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఈ సినిమా నిర్మాణానంతర పనులు సైమల్టేనియస్ గా పూర్తి చేస్తున్నారు. ఇందులో దుల్కార్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో కనిపిస్తాడు. మోస్ట్ అవైటెడ్ 2023 మూవీ 'కింగ్ ఆఫ్ కోథా'ను పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మలయాళం- తమిళం- తెలుగు- కన్నడ - హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. నిమిష్ రవి ఫోటోగ్రఫీ దర్శకుడు. అభిలాష్ ఎన్. చంద్రన్ ఈ సినిమాకు స్క్రిప్టును అందించారు.జీ స్టూడియోస్ తో కలిసి వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించారు. ఇందులో దుల్కర్ సల్మాన్- షబీర్ కల్లరక్కల్- గోకుల్ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా టోవినో థామస్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలను జేక్స్ బిజోయ్- షాన్ రెహమాన్ విడివిడిగా స్వరపరిచారు. ఈ ప్రాజెక్ట్ జీ స్టూడియోస్ సహ-నిర్మాతగా ఉంది. మలయాళ చిత్రసీమలో ప్రతిష్టాత్మక బ్యానర్ గ్రాండ్ అరంగేట్రం గురించి చర్చ సాగుతోంది. ఓనమ్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ఉంది.
కేవోకే అంటే ఏమిటీ?
కింగ్ ఆఫ్ కోథా లో కోథా అనేది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం- జలంధర్ జిల్లాలోని షాకోట్ లోని ఒక గ్రామం. ఇది షాకోట్ నుండి 24 కిలోమీటర్లు (15 మైళ్ళు). నకోదర్ నుండి 43 కిలోమీటర్లు (27 మైళ్ళు). జిల్లా హెడ్ క్వార్టర్ జలంధర్ నుండి 56 కిలోమీటర్లు (35 మైళ్ళు). రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి 198 కిలోమీటర్లు (123 మైళ్ళు) దూరంలో ఉంది. గ్రామం పంచాయతీరాజ్ (భారతదేశం) ప్రకారం గ్రామం ఎన్నికైన ప్రతినిధి అయిన సర్పంచ్ అధీనంలో ఉంటుంది.
షాకోట్ మలిసియన్ స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఈ గ్రామం లుధియానాలోని దేశీయ విమానాశ్రయానికి 104 కిలోమీటర్లు (65 మైళ్ళు) దూరంలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్‌లో ఉంది. శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం అమృతసర్ లో 106 కిలోమీటర్లు (66 మైళ్ళు) దూరంలో ఉన్న రెండవ సమీప విమానాశ్రయం. కేవోకే లో కోథా ఏరియా గ్యాంగ్ స్టర్ పాత్రలో దుల్కార్ సల్మాన్ నటిస్తున్నాడని ప్రస్తుతానికి భావించవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.