హీరోయిన్ తండ్రి పెద్ద రౌడీ.. తనకు కాబోయే అల్లుడు తనను మించిన రౌడీగా ఉండాలనుకుంటాడు. వీరుడు శూరుడు అనదగ్గ అల్లుడి కోసం చూస్తుంటాడు. అటు వైపు హీరోయేమో డమ్మీ. కానీ పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు. హీరోయిన్ మీద ఇష్టంతో తానో పెద్ద పిస్తా అని పరిచయం చేసుకుని విలన్ ఇంట్లోకి అడుగుపెడతాడు. తర్వాత అతడి బండారం బయటపడుతుంది.. మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ కొత్త సినిమా ‘ఎనకు ఇన్నోరు పేరు ఇరుక్కు’ ట్రైలర్ చూస్తే కథపై వస్తున్న ఐడియా ఇది. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సీమశాస్త్రి’ కథ కూడా సిమిలర్ లైన్స్ లోనే ఉంటుంది. కాకపోతే అక్కడ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇక్కడ రౌడీయిజం కనిపిస్తోంది.
‘ప్రేమకథా చిత్రమ్’ రీమేక్ ‘డార్లింగ్’తో హీరోగా పరిచయమైన జి.వి. తమిళనాట మంచి ఫాలోయింగే సంపాదించాడు. ఆ ‘డార్లింగ్’ దర్శకుడు శామ్ ఆంటనే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అతడిపై తెలుగు సినిమాల ప్రభావం బాగా ఉన్నట్లుంది. దర్శకుడిగా తొలి సినిమాకు తెలుగు రీమేక్ ఎంచుకున్న అతను.. ఇప్పుడు మరో తెలుగు సినిమా స్ఫూర్తితో కథ రాసుకున్నట్లున్నాడు. తెలుగమ్మాయి ఆనంది (రక్షిత) ఇందులో కథానాయికగా నటిస్తుండటం విశేషం. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాకు ఇంకో పేరుంది’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. జి.వి. గత రెండు సినిమాల్ని కూడా తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Full View