ఫ్యాన్ వార్: ఈసారి ఎన్టీఆర్ vs బన్నీ..!

Update: 2021-06-21 08:30 GMT
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయ్యాయనేది వాస్తవం. తమ ఫేవరేట్ హీరో గొప్ప అని చెప్పడానికి.. ఇతర హీరోలపై అభిమానులు నెగిటివ్ పోస్టులు పెట్టడం రోజూ చూస్తూనే ఉన్నాం. అభ్యంతరకరమైన కామెంట్స్ పెట్టడంతో పాటు అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు-వీడియోలు పోస్ట్ చేస్తూ మిగతా హీరోలను కించపరుస్తున్నారు. అంతేకాదు నెగెటివ్ హ్యాష్ టాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకముందు తమిళ ఫ్యాన్స్ లో ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు అది తెలుగు హీరో ఫ్యాన్స్ కు విస్తరించింది. నిన్న ఆదివారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ - అల్లు అర్జున్ అభిమానుల మధ్య జరిగిన సోషల్ మీడియా రచ్చ జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

బన్నీ - తారక్ అభిమానుల్లో ముందుగా ఎవరు ఈ వార్ ని స్టార్ట్ చేశారో తెలియదు కానీ.. ఒకరిపై ఒకరు అగ్లీ హ్యష్ ట్యాగ్స్ తో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు. #InsecureFoxAlluArjun అంటూ ఎన్టీఆర్ అభిమానులు.. #CharacterLessPigNTR అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్గర్ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, నెగెటివ్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో హీరోలందరూ ఒకరితో ఒకరు బాగానే ఉంటారు. రెగ్యులర్ గా కలిసే అంత క్లోజ్ కాకపోయినా.. కలిసినప్పుడు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చూపిస్తుంటారు.

ఎన్టీఆర్ - అల్లు అర్జున్ సైతం చాలా క్లోజ్ గా ఉంటారు. అది ఎంతగా అంటే.. ఒకరినొకరు ‘బావా’ అని పిలుచుకునేంత క్లోజ్. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు అసభ్యకరమైన కామెంట్స్ చేసుకుంటూ వారి అభిమాన హీరోల స్థాయిని తక్కువ చేస్తున్నారు. హీరోల పై అభిమానం చూపించడంలో తప్పులేదు. కాకపోతే అభద్రతాభావంతో ఇతర హీరోల పై ఇలా సోషల్ మీడియాలో వార్ కు దిగటం కరెక్ట్ కాదు. హీరోలే స్వయంగా కలుగజేసుకొని మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి అని చెప్పినా అభిమానుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.. ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగడం లేదు. రాబోయే రోజుల్లోనైనా వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News