మారుతున్న కాలాన్ని బట్టి ఒక స్టెప్ తీసుకుంటేనే ముందుకు వెళ్లగలిగేది. ఒకే చోట నిలబడితే ముందడుగు పడదు. ఈ విషయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారతీయ సినిమాకి ఒక దారి చూపించారు. పాన్ ఇండియా సినిమా అనే పదానికి నిర్వచనం చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలమని నిరూపించారు.
ఇప్పుడు నటులకు కూడా ఇది వర్తిస్తుంది. కేవలం ఒక భాషకు మాత్రమే అంకితమై పని చేయాలన్న రూల్ ఏం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తారలు హాలీవుడ్ కి వెళితే తప్పేమీ లేదు. పలువురు బాలీవుడ్ తారలు ఇప్పటికే హాలీవుడ్ లో నటించారు. కానీ ఇప్పుడు మరో నటుడు అరుదైన ఘనతను సాధించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ అరుదైన ఘనతను సాధించాడు. అతను ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన మొదటి ప్రధాన స్రవంతి భారతీయ ప్రధాన నటుడు అయ్యాడు. మార్వెల్ స్టూడియోస్ సిరీస్ Ms. మార్వెల్ లో ఫర్హాన్ భాగం అవుతాడు. ప్రస్తుతానికి ఈ సిరీస్ లో ఫర్హాన్ పోషిస్తున్న పాత్ర గురించి ఎటువంటి సమాచారం లీక్ కాలేదు.
Ms. మార్వెల్ అనేది ఎవెంజర్స్ కు అభిమాని .. ఆమె స్వంత సూపర్ పవర్ లను కలిగి ఉన్న కమలా ఖాన్ పాత్ర చుట్టూ తిరిగే ఒక సూపర్ హీరో సిరీస్. ఈ షోలో కెనడాలో జన్మించిన టీనేజ్ నటుడు ఇమాన్ వెల్లని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నాలుగవ దశలో భాగమైన ఈ సిరీస్ లో పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ వార్తను షేర్ చేస్తూ ఫర్హాన్ అక్తర్ భార్య శిబానీ దండేకర్ ఇలా రాశారు.
``ఇది!!! దీని కోసం వేచి ఉండలేం !! మార్వెల్ యూనివర్స్ లో భాగమైన మొదటి ప్రధాన స్రవంతి ప్రముఖ భారతీయ నటుడు! మీ గురించి గర్వపడటం కంటే ఇంకేదీ లేదు`` అని వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఫర్హాన్ ఆనందం వ్యక్తం చేసారు. విశ్వం అనేది అవకాశాల పరంగా ఎదగడానికి నేర్చుకునేందుకు .. ఈ సందర్భంలో చేస్తున్నప్పుడు చాలా ఆనందాన్ని బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.. అని అన్నారు. శ్రీమతి మార్వెల్ జూన్ 8 నుండి డిస్నీ ప్లస్ లో ప్రసారమవుతుంది.
బాహుబలి మానియా ఇండియన్ సినిమా దశ దిశను మార్చేసింది. ఇప్పుడు అదే తరహాలో నటీనటుల కు అవకాశాల పరంగా సరికొత్త దారులు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. కేవలం ఇండియా బేస్డ్ సినిమాలే కాదు...అంతర్జాతీయ విఫణిలోనూ సినిమాలు చేసే రేంజుకు మన స్టార్లు ఎదగాలని ఆకాంక్షిద్దాం. ఫర్హాన్ అందుకు మార్గదర్శకుడు అయితే ఆహ్వానించదగిన పరిణామం. ఫర్హాన్ తర్వాత రామ్ చరణ్- తారక్- ప్రభాస్ - బన్ని కూడా అదే దారిలో వెళ్లాలని ఆశిద్దాం. అప్పుడు మన స్టార్లకు దారులు ఇంకా స్పష్టంగా మారతాయి. మన సినిమా కేవలం దేశీయం మాత్రమే కాదు.. అంతర్జాతీయం అని కూడా ప్రూవ్ అవుతుంది.
ఒక హిందీ నటుడు హాలీవుడ్ లో ఎదిగితే ప్రోత్సహించే మనస్తత్వం మన(దక్షిణాదికి తెలుగు వారికి)కు ఉంది. అదే ఒక దక్షిణాది నటుడు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతూ దూసుకొస్తే పొగిడే తత్వం వాళ్లకు ఉందా? అన్నదే అసలు పాయింట్. కుంచించుకుపోయిన సంకుచిత భావనల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం గనుక ఇకపై ఏం జరగడానికి అయినా ఆస్కారం ఉందని అందరికీ అర్థమవుతున్న సందర్భమిది.