ఫ‌లించ‌ని ఫ‌రియా ఆశ‌.. నెక్స్ట్ ఏంటి అమ్మ‌డు?

Update: 2022-11-13 00:30 GMT
'జాతిరత్నాలు' వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఓ రత్నమే ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాద్ పోరి తొలి సినిమా తోనే అందం, అభినయం మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. జాతిరత్నాలు తర్వాత అఖిల్‌ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమాలో ఓ చిన్న పాత్ర‌ను పోషించింది.

అలాగే 'బంగార్రాజు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక రీసెంట్‌గా ఫ‌రియా పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, అమృతా క్రియేష‌న్స్ బ్యానర్‌లపై వెంకట్ బోయినపల్లి నిర్మించారు.

నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ‌రియా ఎంతగానో ఆశపడింది. పైగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఫరియాకు మరిన్ని ఆఫర్లు వచ్చేవి. కానీ ఆమె ఆశ ఫలించలేదు. దీంతో ఈ అమ్మడు నెక్స్ట్ ఏం చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్ర‌స్తుతం తెలుగులో ఫ‌రియా ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేస్తోంది. అదే 'రావణాసుర'. మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది.

ఇందులో  ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, జ‌గ‌ప‌తి బాబు, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఫ‌రియా ఇప్పుడు త‌న‌ హోప్స్ అన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీ రిజల్ట్ లో ఏమైనా తేడా వచ్చిందంటే ఫరియా కెరీర్ డేంజర్ జోన్ లో పడటం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News