ఈ ముగ్గురు భామ‌లు ఇక‌నైనా స్పీడు పెంచుతారా? లేదా?

Update: 2022-11-05 23:30 GMT
ఆకట్టుకునే అందం, యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న కొందరు హీరోయిన్లు కెరీర్ పరంగా వెనుక పడ్డారు. ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సిన పేరు సాయి పల్లవి. 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ అనతి కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ల లిస్టులో చేరింది.

కానీ, ఏమైందో ఏమో కానీ సాయి పల్లవి గత కొద్ది రోజుల నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. మునుప‌టి జోరు ఆమెలో ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాది 'విరాటపర్వం', 'గార్గి' చిత్రాలతో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాలు పెద్దగా అల‌రించ‌లేకపోయాయి. అయితే ఈ సినిమాల తర్వాత సాయి పల్లవి నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఈ విష‌యంలో అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

అలాగే అన్నీ ఉన్నా కెరీర్ ప‌రంగా వెన‌క‌ప‌డ్డ హీరోయిన్ల లిస్ట్ లో నివేదా థామస్ ఒక‌రు. బాలనటిగా సినీరంగ ప్ర‌వేశం చేసిన నివేదా.. మ‌ల‌యాల చిత్రాల‌తో హీరోయిన్ గా మారింది. 'జెంటిల్ మేన్' మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 'జై లవకుశ', '118', 'బ్రోచేవారెవరురా' వంటి చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సైతం కెరీర్ ప‌రంగా స‌త్తా చాట‌లేక‌పోతోంది. ఈమె నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన 'శాకిని డాకిని' పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నివేదా థామస్ చేతిలో ఒక ప్రాజెక్టు కూడా లేదని అంటున్నారు. ఆమె నుంచి ఎలాంటి కొత్త సినిమా అప్డేట్లు కూడా రాలేదు.

ఇక 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం అయిన‌ అందాల సోయగం నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత న‌భా న‌టేష్ దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది.

ఇస్మార్ట్ శంకర్ అనంతరం నభా నటేష్ నటించిన 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. వరుస ఫ్లాపుల కారణంగా నభా న‌టేష్ కు ఆఫ‌ర్లు బాగా త‌గ్గిపోయాయి. అస‌లు ఈ అమ్మ‌డి చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. మరి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ముగ్గురు భామ‌లు ఇకనైనా కెరీర్ ప‌రంగా స్పీడు పెంచుతారా? లేదా? అన్నది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News