ఫైనల్ గా ఆయనకే వోటేసిన దిల్ రాజు

Update: 2019-03-07 08:13 GMT
తమిళంలో సూపర్ హిట్ అయిన '96' సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.  తెలుగులో ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.  ఒరిజినల్ సినిమాను రూపొందించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ కే దిల్ రాజు రీమేక్ బాధ్యతలు అప్పజెప్పారు.  తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష నటించిన పాత్రలను తెలుగులో శర్వానంద్.. సమంతాలు పోషిస్తారు.

ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయంలో మాత్రం దర్శకుడు ప్రేమ్ కుమార్ కు రాజుగారికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదట.  ఒరిజినల్ సినిమాకు సంగీతం అందించిన గోవింద వసంతనే తెలుగులో కూడా తీసుకుందామని ప్రేమ్ కుమార్  పట్టుబడుతున్నాడట.  '96' సినిమాతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ మొదటి నుంచి ట్రావెల్ అయ్యాడని.. ఆ సినిమాలోనే ఫీల్ మిస్ కాకుండా సంగీతం అందించగలడనే ప్రేమ్ కుమార్ అభిప్రాయమట.  కానీ రాజుగారు మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు సంగీతం అందించే మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుందామని అన్నారట. తమిళంలో గోవింద వసంత సూపర్ అల్బమ్ ఇచ్చినా తెలుగు ప్రేక్షకులకు అలాంటి సంగీతం కనెక్ట్ కాదని ఆయన అలోచిస్తున్నారట. ఇద్దరి మధ్యలో ఈ విషయంలో చాలాసార్లు చర్చలు జరిగాయని ఫైనల్ గా రాజుగారు డైరెక్టర్ మాటకే విలువిచ్చి గోవింద వసంతనే ఫైనలైజ్ చేశారట.  కానీ తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు సంగీతం ఉండాలని కండిషన్ పెట్టారట.    

ఈ సినిమాకు 'జాను' అనే టైటిల్ ను పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాను సమ్మర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు..ఇతర వివరాలను వెల్లడిస్తారు. 
Tags:    

Similar News